కానిస్టేబుల్ కుటుంబానికి రూ. కోటి పరిహారం: సీఎం రేవంత్

నిజామాబాద్లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి సీఎం రేవంత్ రూ. కోటి పరిహారం, ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

flnfln
Oct 21, 2025 - 10:51
 0  3
కానిస్టేబుల్ కుటుంబానికి రూ. కోటి పరిహారం: సీఎం రేవంత్

TG:

నిజామాబాద్లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. కోటి పరిహారం ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం ఇస్తామని తెలిపారు. అదనంగా పోలీస్ భద్రత సంక్షేమ నిధి నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.8 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రేవంత్ స్పష్టం చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.