సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం – రైల్వే ప్రాజెక్టులు, హైదరాబాద్ ట్రాఫిక్ పరిష్కారంపై దృష్టి

హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి రైల్వే ప్రాజెక్టుల పురోగతి, ట్రాఫిక్ సమస్య పరిష్కారం, MMTS విస్తరణ, భవిష్యత్తు రవాణా ప్రణాళికలపై కీలక సమావేశం నిర్వహించారు. రాబోయే ఐదేండ్లలో రైల్వే సౌకర్యాలు విస్తరించేందుకు చర్యలు చేపట్టనున్నారు.

flnfln
Sep 11, 2025 - 15:28
 0  6
సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం – రైల్వే ప్రాజెక్టులు, హైదరాబాద్ ట్రాఫిక్ పరిష్కారంపై దృష్టి

• అధికారులతో కీలక సమావేశం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

• కొత్త రైల్వే మార్గాలు అభివృద్ధి పనులు గురించి చర్చ 

• హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య పైన పరిష్కారం 

• ముందున్న ఐదేండ్లు లక్ష్యం

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాల పై కీలక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం హైదరాబాదులోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగింది. రైల్వే ఉన్నత అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. సమావేశంలో ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేమ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొనడం జరిగింది. అలాగే దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో పాటు పలు విభాగాల అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.  

ఈ సమావేశంలో ఖమ్మం విజయవాడ, వరంగల్ మంచిర్యాల, నిజామాబాద్ నాoదెడ్, నల్లగొండ మహబూబ్నగర్, రైల్వే మార్గాలు పురోగతి భవిష్యత్తు ప్రణాళికలు చర్చకు వచ్చాయి. ఈ ప్రాజెక్టులు అన్నీ పూర్తయితే రవాణా సౌకర్యాలు పెరగడంతో పాటు వాణిజ్యపరమైన లాభాలు కూడా పెరుగుతాయి అని అధికారులు వివరించడం జరిగింది. 

 హైదరాబాద్ కు ఉన్న అతిపెద్ద సమస్య ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ ను తగ్గించేందుకు మెట్రో రైల్, MM TS , RTC బస్సుల మధ్య సామాన్యాయం అవసరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అలాగే చేశారు. మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (MMTS) విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించడం జరిగింది. అలాగే ప్రాజెక్టుల ఆలస్యానికి నిధుల కొరతే అని అధికారులు పేర్కొనగా సీఎం రేవంత్ రెడ్డి నిధుల గురించి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సహాయము తప్పకుండా అందిస్తుందని, కేంద్రం నుంచి కూడా నిధులు మనం రాబట్టే ప్రయత్నం చేయాలి అని హామీ ఇవ్వడం జరిగింది. 

రాబోయే ఐదేళ్లలో రైల్వే సౌకర్యాలు విస్తృతంగా పెరగాలి అని రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. ఎక్స్ప్రెస్ రైళ్లు, కార్గో సర్వీసులు, ఎలక్ట్రిఫికేషన్ పనులను వేగవంతం చేసి రాష్ట్రాన్ని జాతీయ రైల్వే మ్యాప్లో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులో పూర్తయితే ప్రయాణికులకు సమయం ఎంతో కలుస్తొస్తుంది. రవాణా ఖర్చులు ఎంతో తగ్గుతాయి. పరిశ్రమలు వ్యవసాయం ఉత్పత్తుల రవాణాకు ఎంతో సౌకర్యాలు కలుగుతాయని అధికారులే తెలిపారు. అలాగే గ్రామాల్లో నుంచి పట్టణాల నుంచి ప్రయాణించే వారికి ఎంతో సులభ రాకపోకలు ఏర్పడతాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.