సీఎం రేవంత్ రెడ్డి రాకతో ఖమ్మంలో ఏం మారబోతోంది? ఏర్పాట్లపై కలెక్టర్ శ్రీజ ప్రత్యేక దృష్టి!
ఖమ్మం జిల్లాలో జనవరి 18న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ పరిశీలించారు. శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల నిర్వహణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
* తెలంగాణ సీఎం ఖమ్మం పర్యటన
* జనవరి 18న ఖమ్మం రాబోతున్న ముఖ్యమంత్రి
* సీఎం రాకతో ఖమ్మం జిల్లా అధికారులు ఎలెక్ట్
* సీఎం ఖమ్మం జిల్లా పర్యటన వెనుక ఉన్న ఉద్దేశం అదేనా!
* పర్యటన తర్వాత ఏం జరగనుంది?
* పూర్తి వివరాలు తెలియాలి అంటే కింద ఉన్న సమాచారాన్ని చదవండి.
fourth line news : జనవరి 18న ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన జరగనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఆదేశించారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి తదితర అధికారులతో కలిసి సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో, అలాగే కూసుమంచి మండలంలోని పలు ప్రాంతాల్లో సీఎం పాల్గొననున్న శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల స్థలాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.
సీఎం పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వాహనాల పార్కింగ్‌కు తగిన స్థలాలను కేటాయించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాకపోకలను సజావుగా నిర్వహించాలన్నారు.
అలాగే సభా ప్రాంగణంలో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు వంటి మౌలిక సదుపాయాలు పూర్తిగా సిద్ధంగా ఉంచాలని అధికారులకు తెలిపారు. వేదిక నిర్మాణం, సౌండ్ సిస్టమ్, ఫ్లెక్సీలు, బ్యానర్లు వంటి ఏర్పాట్లలో నాణ్యత ఉండాలని, సీఎం పర్యటన ప్రతిష్ఠాత్మకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల సమయంలో సంబంధిత శాఖల అధికారులు హాజరై ఉండాలని, కార్యక్రమాల వివరాలను స్పష్టంగా సిద్ధం చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సూచించారు. సీఎం పర్యటనలో ప్రారంభించబోయే అభివృద్ధి పనులు, శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టుల వివరాలు ముందుగానే సిద్ధంగా ఉంచాలని తెలిపారు.
ఈ పర్యటన ద్వారా ఖమ్మం జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని అధికారులు తెలిపారు. సీఎం పర్యటన జిల్లాకు ఎంతో ప్రాధాన్యత కలిగినదని, అందుకే ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డాక్టర్ పి. శ్రీజ స్పష్టం చేశారు. చివరగా, సీఎం పర్యటన విజయవంతంగా పూర్తయ్యేలా అధికారులు అందరూ సమిష్టిగా పనిచేయాలని ఆమె కోరారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0