ఖమ్మంలో రేపే భారీ జాబ్ మేళా.. నెలకు ₹25 వేల జీతంతో ప్రైవేట్ ఉద్యోగాలు!

ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. రేపు (శుక్రవారం) ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. నెలకు రూ.25 వేల వరకు జీతం పొందే ప్రైవేట్ ఉద్యోగాలు అందుబాటులో ఉండనున్నాయి.

Jan 8, 2026 - 10:28
 0  4
ఖమ్మంలో రేపే భారీ జాబ్ మేళా.. నెలకు ₹25 వేల జీతంతో ప్రైవేట్ ఉద్యోగాలు!

నిరుద్యోగులందరికీ ఖమ్మం లో రేపు జాబ్ మేళా. 

2. ఖమ్మంలో జాబ్ మేళా ప్రారంభం. 

3. నెలకు 25 వేల జీతం పొందే అవకాశం. 

4. ప్రైవేట్ ఉద్యోగాలకు ఖమ్మంలో అవకాశం.

ఖమ్మం: ఫోర్త్ లైన్ న్యూస్ కథనం 

జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో రేపు (శుక్రవారం) జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.శ్రీరామ్ తెలిపారు. టేకులపల్లి మండలంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఈ జాబ్ మేళా ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది.

ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు పదో తరగతి, ఇంటర్ అర్హత కలిగిన వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. విద్యార్హతల ఆధారంగా వివిధ విభాగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం పొందే అవకాశం ఉందని, పనితీరు ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కూడా కల్పించబడతాయని ఆయన వివరించారు. ఉద్యోగాలు ప్రధానంగా ఫార్మసీ, తయారీ, మార్కెటింగ్, సర్వీస్ విభాగాలకు సంబంధించినవిగా ఉండనున్నట్లు సమాచారం.

జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యా సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, బయోడేటా (రెజ్యూమ్)తో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని సూచించారు. ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేదని, ప్రత్యక్షంగా హాజరై ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఏ జాబ్ మేళం ద్వారా గ్రామాలలో మండలాలలో ఉన్న యువతకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. చాలామంది యువత నిరుద్యోగ సమస్య కు ఎంతో ఇబ్బంది పడుతున్నా  వేల జాబ్ మేళా  కలగజేయడం నిరుద్యోగులకు ఎంతో సంతోషంగా ఉంటుంది. రహత ఉన్న వాళ్ళందరూ మంచి ఉద్యోగాలు పొందుకోవాలి అని అధికారులు ఆదేశించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0