పారిశ్రామికవేత్తలకు దీపావళి కానుకగా రూ.1500 కోట్ల ప్రోత్సాహకాలు: CM చంద్రబాబు
దీపావళి సందర్భంగా CM చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు రూ.1500 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలకు దీపావళి శుభవార్త అందించారు. రాష్ట్రంలోని పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు రూ.1500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను తొలి విడతగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
చంద్రబాబు తన ట్వీట్‌లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పరిశ్రమల అభివృద్ధి కోసం ఈ నిధులను కేటాయిస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పారిశ్రామికవేత్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0