కార్తీక మాసం ప్రభావం: భారీగా పడిపోనున్న చికెన్ ధరలు
కార్తీక మాసం ప్రారంభంతో మాంసాహారం డిమాండ్ తగ్గే అవకాశం. చికెన్ ధరలు రూ.250 నుంచి రూ.170కి పడిపోవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
పవిత్రమైన కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభమైంది. ఈ నెలలో ఎంతోమంది భక్తులు శివారాధనలో నిమగ్నమై మాంసాహారం ముట్టకూడదని నిర్ణయించుకుంటారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా చికెన్ అమ్మకాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి కిలో చికెన్ ధర రూ.210 నుంచి రూ.250 వరకు ఉంది. కానీ మరో రెండు మూడు రోజుల్లో డిమాండ్ తగ్గడంతో ధరలు రూ.170 నుంచి రూ.180 మధ్యకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. కార్తీక మాసం మొత్తం ఈ తగ్గుదల కొనసాగుతుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0