చెస్ ప్రపంచాన్ని కన్నీళ్లు పెట్టించిన డానియెల్ నరోడిట్స్కీ మరణం
అమెరికన్ చెస్ గ్రాండ్మాస్టర్ డానియెల్ నరోడిట్స్కీ (29) మరణం చెస్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 18 ఏళ్లకే గ్రాండ్మాస్టర్ హోదా సాధించిన ఆయన అండర్-12 వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచారు.
అమెరికన్ చెస్ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. ప్రతిభావంతుడైన గ్రాండ్మాస్టర్ డానియెల్ నరోడిట్స్కీ (29) కన్నుమూశారు. ఈ విషయాన్ని నార్త్ కరోలినాలోని చార్లెట్ చెస్ క్లబ్ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
“టాలెంటెడ్ చెస్ ప్లేయర్, అద్భుతమైన ఎడ్యుకేటర్, చెస్ కమ్యూనిటీలో అందరి మనసులు గెలుచుకున్న వ్యక్తి ఇక లేరు” అని క్లబ్ తెలిపింది. అయితే ఆయన మరణానికి గల కారణాలు వెల్లడించలేదు.
డానియెల్ 18 ఏళ్ల వయసులోనే గ్రాండ్మాస్టర్ హోదా అందుకున్నారు. చిన్న వయసులోనే అద్భుత ప్రతిభ కనబరిచి అండర్–12 వరల్డ్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0