బీటెక్‌ అభ్యర్థులకు సూపర్‌ ఛాన్స్‌: కేంద్ర సెక్రటేరియట్‌లో 250 డీఎఫ్‌ఓ ఉద్యోగాలు

కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్‌ 250 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్/ఎంఎస్సీతో పాటు GATE పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం ₹44,900–₹1,42,400. చివరి తేదీ డిసెంబర్ 14.

flnfln
Nov 14, 2025 - 14:05
 0  4
బీటెక్‌ అభ్యర్థులకు సూపర్‌ ఛాన్స్‌: కేంద్ర సెక్రటేరియట్‌లో 250 డీఎఫ్‌ఓ ఉద్యోగాలు

కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్‌ భారీ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 250 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ (DFO) పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు బీటెక్, ఎంఎస్సీ చదివిన వారితో పాటు GATE క్వాలిఫై అయితే దరఖాస్తు చేయడానికి అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30 ఏళ్లు మించకూడదని నోటిఫికేషన్‌లో స్పష్టంచేశారు.

కంప్యూటర్ సైన్స్/ఐటీ, డేటా సైన్స్/ఏఐ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వంటి పలు విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి ₹44,900 నుండి ₹1,42,400 వరకు జీతం లభిస్తుంది.

అప్లికేషన్‌ స్వీకరణ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. దరఖాస్తుల చివరి తేదీ డిసెంబర్ 14గా నిర్ధారించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.