నటి నోరా ఫతేహీ కారుకు ప్రమాదం: మద్యం మత్తులో దూసుకొచ్చిన కారు ..?
బాలీవుడ్ ప్రముఖ నటి నోరా ఫతేహీకి పెను ప్రమాదం తప్పింది. ముంబైలో ఒక మ్యూజిక్ ఈవెంట్‌కు వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
* బాలీవుడ్ ప్రముఖ నటికీ ప్రమాదం
* మ్యూజిక్ ఈవెంట్ అనే కార్యక్రమానికి వెళుతుండగా
* మద్యం సేవించి అతివేగంతో
* పోలీసులు ఏమని వెల్లడించారు అంటే ?
fourth line news కథనం : బాలీవుడ్ ప్రముఖ నటి కి పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోనికి వెళ్తే: నటి నోరా ఫతేహీ కారుకు ప్రమాదం జరిగింది. ముంబైలో జరుగుతున్న ఒక మ్యూజిక్ ఈవెంట్ అనే కార్యక్రమానికి వెళ్తున్నంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది అంటేఅంబోలీలోని లింక్ రోడ్లో మీద ఒక వ్యక్తి మద్యం సేవించి కారును ఓవర్ స్పీడ్ గా నడిపి నటి నోరా ఫతేహీ కారుకు గుద్దినట్టు పోలీసులు వెల్లడించారు.
అయితే ఈ ప్రమాదంలో బాలీవుడ్ ప్రముఖ నటి నోర ఫతేహీ స్వల్ప గాయాలు అవటం వల్ల అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను దగ్గర ఉన్న ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ప్రమాదాన్ని చేసిన వ్యక్తిని పోలీసులు అదుపు తీసుకొని అతనిపైన కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ఈ ప్రమాదంలో నోరా ఫతేహీ కారు కొంత డామేజ్ అయినప్పటికిని ప్రమాదం పెద్ద స్థాయిలో జరగలేదు కాబట్టి బాలీవుడ్ ఆమె యొక్క అభిమానులు కొంత ఆనందం వ్యక్తం చేశారు. ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా సినిమా అప్ డేట్స్, హీరోల, హీరోయిన్ల అభిప్రాయాలు వారి యొక్క సినిమాలు మీరు ఈ న్యూస్ వెబ్సైట్ ద్వారా చదవగలరు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0