11వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం కేసు నిందితుడిపై న్యాయవాదుల దాడి – వీడియో వైరల్

భోపాల్ జిల్లా కోర్టులో 11వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన నిందితుడిపై న్యాయవాదులు దాడి చేసిన ఘటన వైరల్ అవుతోంది. వీడియో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో నిందితుడిని పోలీసులు కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పూర్తి వివరాలు చదవండి.

flnfln
Feb 3, 2026 - 15:51
 0  3
11వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం కేసు నిందితుడిపై న్యాయవాదుల దాడి – వీడియో వైరల్

* 11వ తరగతి విద్యార్థిని పై అత్యాచారం, బ్లాక్ మెయిల్

* నిందితున్ని కొట్టుకు హాజరు పరుస్తున్నంగా న్యాయవాదులు దాడి 

* వీడియో తో బ్లాక్ మెయిల్ చేసి లక్ష రూపాయలు డిమాండ్ 

* బాధ్యతరాలు భయపడే 40,000 ఇచ్చింది 

 fourth line news : ప్రపంచంలో ఎక్కడ జరిగిని దృశ్యాలు అన్నీ మనదేశంలోనే జరుగుతాయి. భోపాల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో మంగళవారం జరిగిన ఘటన చూస్తే అందరూ షాక్ కావాల్సిందే. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, బ్లాక్మెయిల్ కేసులో అరెస్ట్ అయిన నిందితుని పోలీసులు కోర్టుకు హాజరు పరచగా, అక్కడ ఉన్న న్యాయవాదులు అందరూ ఆగ్రహంతో ఒకేసారి అతనిపై దాడి చేశారు. న్యాయవాదులతో పాటు ప్రజలు కూడా దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలో అటు పోలీసులకు న్యాయవాదులకు మధ్య తీవ్రతోపులాట ఘటన జరిగింది. 

ఒసాఫ్ అలీ ఖాన్ వ్యక్తి కోహెఫిజా ప్రాంతంలో 11వ తరగతి విద్యార్థిని పై  అత్యాచారం చేసిన కేసులో పోలీసులు సోమవారం రాత్రి అతని అరెస్ట్ చేశారు. నిందితున్ని మంగళవారం కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు తీసుకురాగా, అక్కడ గుమ్మిగూడిన కొందరు న్యాయవాదులు అందరూ నిందితుని చితకబాదారు. ఆ దాడికి కోర్టు కార్య కలాపాలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఎట్టకేలకు పోలీసులు చాలా కష్టపడి నిందితున్ని కోర్టు లోపలికి తీసుకువెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. 

బాధ్యతరాలు జూలైలో నిందితులు తనపై అత్యాచారం చేశాడని ఆ సమయంలో రహస్యంగా వీడియో తీసి దానిని అడ్డుపెట్టుకొని తనని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధ్యత రాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే వీడియో బయట పెట్టకుండా ఉండాలంటే లక్ష రూపాయలు డిమాండ్ చేయగా, అతని మాటలకి భయపడిన నిందితురాలు 40 వేలు ఇచ్చినట్టు తెలిపింది. అంతేకాకుండా తన ఇష్టానికి విరుద్ధంగా ఇస్లామిక్ ప్రార్థనలో చేయమని బలవంతం చేశాడని ఫిర్యాదులో నమోదయింది. పోలీసులు నిందితుని కస్టడీలోనికి తీసుకొని అతని ఫోన్ ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి స్నేహితురాలి ద్వారా నిందితుడికి ఆమెతో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. కానీ న్యాయవాదులు చేసిన పనికి పబ్లిక్ నుంచి మంచి టాక్ ఏ వస్తుంది. న్యాయవాదులు ఈ విధంగా చేయడం కరెక్టేనా? మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.