భారత్–అమెరికా సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయా? ట్రంప్–మోడీ మధ్య కీలక చర్చలు
కొంతకాలం సుంకాల వివాదంతో దూరమైన భారత్–అమెరికా సంబంధాలు మళ్లీ బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ చేసిన కీలక వ్యాఖ్యలకు మోడీ స్పందించడంతో వాణిజ్య చర్చలు కొత్త దశలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
కొంతకాలం అమెరికా భారత దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి దానికి కారణం ట్రంప్ భారీగా సుంకాలు విధించడమే. కానీ మళ్లీ ట్రంపు బుధవారం ట్రంప్ కీలక పోస్టు చేశారు. భారత దేశానికి ప్రధాని అయినా మోడీ నాకు ఒక మంచి స్నేహితుడు..... తనతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాను అని సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. వెంటనే మోడీ కూడా ట్రంప్ పోస్ట్కి రిప్లై ఇచ్చారు. తను కూడా చంపుతా మాట్లాడేందుకు రెడీగా ఉన్నట్టు ప్రకటించడం జరిగింది. b రెండు దేశాల మధ్య మరలా స్నేహ బంధాలు బలపడే అవకాశం ఉంది.
మరలా భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభమైతాయని వర్గాలు పేర్కొనడం జరిగింది. ఇప్పటికే ఇద్దరి మధ్యలో ఐదు రౌండ్లు చర్చలు జరిగాయి. ఆరవ రౌండ్ చర్చలు కూడా ఢిల్లీలోనే జరుగుతాయి అని అధికారులు మరియు జాతీయ మీడియాకు తెలిపారు.
అమెరికా భారత్ లో ఉండే పాడి వ్యవసాయంపై రాయితీలు కోరుతుంది. కానీ భారతదేశానికి ఇవి రెండూ చాలా ప్రాముఖ్యమైన జీవననాడి. అందుకే రాయితీలు ఇచ్చేందుకు భారత దేశం మొగ్గు చూపడం లేదు. కొత్త చర్చలు అక్టోబర్లో జరిగే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రైతులకు వ్యతిరేకంగా ఏ నిర్ణయము తీసుకున్నా ఒప్పుకోకూడదు అని భారత్ భావిస్తుంది.
మనదేశంలో బాదం యాపిల్, మొక్కజొన్న, సోయాబీన్స్, ఇథనాల్ వంటి ఉత్పత్తులపై సుంకాలను తగ్గించే ప్రతిపాదనలను కూడా భారతదేశం తోసిపుస్తోంది. ఒకవేళ అమెరికా నుంచి సానుకూలత నిర్ణయం రాకపోతే భారత్ అమెరికాకు దూరంగా ఉండాలి అని భావిస్తున్నట్టు ప్రచారం.
ఇదివరకే అన్ని దేశాలతో పాటు మన దేశాన్ని కూడా సుంకాలు అమెరికా వేయడం జరిగింది. కానీ రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరినామాగా ట్రంప్ 50 శాతం సుంకాలు భారత్ పై విధించారు. దాంతో స్నేహంగా ఉన్న దేశాలు కొంచెం దూరంగా ఉండటం జరిగింది. కానీ అన్నదాతల కోసం ఎంత భారమైన భరిస్తాము అని నరేంద్ర మోడీ ప్రకటించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0