‘బాహుబలి ది ఎపిక్’ సిద్ధం.. ఎనిమిదేళ్ల కిందటి ట్వీట్ ఇప్పుడు వైరల్!

‘బాహుబలి ది ఎపిక్’ ఈ నెల 31న రిలీజ్ కానుంది. ఎనిమిదేళ్ల కిందట నారాయణరావు చేసిన బాహుబలి ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ ఎలా నిజమవుతుందో తెలుసుకోండి

flnfln
Oct 19, 2025 - 17:06
 0  3
‘బాహుబలి ది ఎపిక్’ సిద్ధం.. ఎనిమిదేళ్ల కిందటి ట్వీట్ ఇప్పుడు వైరల్!

భారీ అంచనాల మధ్య మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది ‘బాహుబలి ది ఎపిక్’. ‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి ఒకే చిత్రంగా ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

‘బాహుబలి: ది బిగినింగ్’ మరియు ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ చిత్రాలు తమ కాలంలో బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించాయి. ఇప్పుడు అవి కలిపి ఒకే ఎపిక్ మూవీగా రావడం సినీప్రియుల్లో కొత్త ఉత్సాహం రేపుతోంది.

ఈ నేపథ్యంలో ఎనిమిదేళ్ల కిందట చేసిన ఓ ట్వీట్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిజినెస్‌మ్యాన్ నారాయణరావు 2017లో చేసిన ఆ ట్వీట్‌లో –

“‘బాహుబలి పార్ట్ 1 & 2’ కలిపి ఓ సినిమాగా విడుదల చేస్తే, ఇది ప్రపంచ సినిమా చరిత్రలో అద్భుతం అవుతుంది. తక్కువలో తక్కువ రూ.500 కోట్లు రాబట్టవచ్చు” అని పేర్కొన్నారు.

అప్పుడు పెద్దగా చర్చ కాకపోయిన ఆ ట్వీట్ ఇప్పుడు నిజమవుతుందనే ఆనందం అభిమానుల్లో నెలకొంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.