అధికారంలో ఉండగానే పెళ్లి చేసుకొని చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్

ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ జోడీ హేడెన్‌ను వివాహం చేసుకొని చరిత్ర సృష్టించారు. అధికారంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న మొదటి ప్రధానిగా రికార్డు సాధించారు. వివాహ వివరాలు, టోటో రింగ్ బేరర్‌గా నిలిచిన హైలైట్స్ – Fourth Line News.

flnfln
Nov 29, 2025 - 19:46
Nov 29, 2025 - 19:50
 0  3
అధికారంలో ఉండగానే పెళ్లి చేసుకొని చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్

* ఆస్ట్రేలియా ప్రధాని పెళ్లి 

* ప్రేయసి జోడీ హేడెన్‌ను వివాహం చేసుకున్న ఆస్ట్రేలియా ప్రధాని

* పెళ్లి చేసుకొని కొత్త రికార్డులను నెలకొల్పిన ఆస్ట్రేలియా ప్రధాని 

* బ్బేరర్‌గా నిలిచిన పెంపుడు కుక్క 'టోటో'

* పూర్తి వివరాల్లోకి వెళితే. 

fourth line news : 

 పెళ్లి చేసుకోవడం వల్ల ఒక కొత్త రికార్డును సృష్టించిన ఆస్ట్రేలియా ప్రధాని. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ తన ప్రేయసి జోడీ హేడెన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఆయనకి ఒక అరుదైన రికార్డును సాధించింది. ఆస్ట్రేలియా చరిత్రలోనే అధికారంలో ఉండగా వివాహమును చేసుకున్న మొట్టమొదటి ప్రధానిగా ఆయన రికార్డులు నెలకొల్పారు. 62 ఏళ్ల అల్బనీస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో పనిచేస్తున్న జోడీ హేడెన్‌తో ఒక్కటయ్యారు. 

ఈ వివాహం కాన్‌బెర్రాలోని ప్రధాని అధికారిక నివాసం 'ది లాడ్జ్' గార్డెన్‌లో కుటుంబసభ్యులు , మరియు స్నేహితులు మధ్య వివాహం చాలా ఘనంగా జరిగింది. వివాహం తర్వాత వధువు చేతిని పట్టుకొని ఉన్న ఒక వీడియోను " మ్యారీడ్ " అనే ఒకే ఒక్క పదంతో ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ పోస్ట్ ప్రెసెంట్ వైరల్ గా మారుతుంది. 

ప్రాముఖ్యంగా యొక్క వివాహములో అల్బనీస్ పెంపుడు కుక్క 'టోటో' రింగ్ బేరర్‌గా వ్యవహరించడం ప్రత్యక్షంగా అందరినీ ఆకర్షించింది. 2024 వాలెంటైన్స్ డే నాడు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, హేడెన్‌కు求 ప్రపోజ్ చేసి తమ సంబంధాన్ని అధికారికం చేశారు. 2019లో తొలి భార్యతో విడిపోయిన అల్బనీస్‌కి నాథన్ అనే కుమారుడు ఉన్నాడు. మెల్‌బోర్న్‌లో ఐదేళ్ల క్రితం జరిగిన ఓ బిజినెస్ డిన్నర్‌లో ఇద్దరి మధ్య పరిచయం ప్రారంభమై తర్వాత సన్నిహితంగా మారింది. తాజాగా పెళ్లి చేసుకున్న ఈ జంట, సోమవారం నుంచి ఐదు రోజులపాటు ఆస్ట్రేలియాలోనే హనీమూన్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం.

* ఆస్ట్రేలియా ప్రధాని వివాహం గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 

* fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.