16 నెలల్లో ఏపీలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు.. లోకేశ్ కీలక వ్యాఖ్యలు
గత 16 నెలల్లో ఏపీలోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యమని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల వర్షం కురుస్తోందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
గత 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని, ఇది దేశంలో మరే రాష్ట్రానికీ సాధ్యం కాలేదని చెప్పారు.
‘ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణ’ కూటమి ప్రభుత్వ నినాదమని లోకేశ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతూ, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.
దేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉన్నా, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది’ అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఆయన ఈ వ్యాఖ్యలు AUSలో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో చేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0