బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చలి తీవ్రత కూడా పెరిగింది. — Fourth Line News
బంగాళాఖాతంలో మరోసారి వాతావరణ మార్పులు నమోదయ్యాయి. ఈ నెల 17న అక్కడ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
అయితే ఈ వ్యవస్థ పెద్దగా తీవ్రతను సంతరించుకోకపోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు, చలి ప్రభావం కూడా రాష్ట్రవ్యాప్తంగా పెరిగింది. నిన్న అల్లూరిలోని ముంచింగి పుట్టులో 14.4 డిగ్రీల సెల్సియస్, డుంబ్రిగుడలో 14.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
🌧️ Fourth Line News
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0