గోమాంసం అక్రమ దందాపై పవన్ కళ్యాణ్ సీరియస్: నిందితులను వదలొద్దని......
విశాఖ జిల్లా ఆనందపురంలో పట్టుబడ్డ 187 టన్నుల అక్రమ గోమాంసాన్ని కోర్టు ఆదేశాలతో అధికారులు పూడ్చివేశారు. ఈ కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
1. విశాఖపట్నంలో భారీగా గోమాంసం అక్రమ రవాణా.
2. 187 టన్నుల గోమంసాన్ని కోర్టు.?
3. ఈ సంఘటనపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
4. కొట్టిచ్చిన తీర్పు ఏమిటంటే ?
5. పరారైన వారిని ఏమాత్రం విడిచి పెట్టము?
విశాఖపట్నం జిల్లా ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గోమాంసం అక్రమ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు నెలల క్రితం ఓ కోల్డ్ స్టోరేజీలో పోలీసులు స్వాధీనం చేసుకున్న 187 టన్నుల గోమాంసాన్ని కోర్టు ఆదేశాల మేరకు తాజాగా పూడ్చివేశారు.
దేశవిదేశాలకు అక్రమంగా గోమాంసం తరలిస్తున్న ముఠాపై అందిన సమాచారం మేరకు పోలీసులు అప్పట్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో గోమాంసాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారికి సంబంధించిన మరిన్ని కోణాలపై విచారణ కొనసాగుతుంది.
కోల్డ్ స్టోరేజీలో నిబంధనలకు విరుద్ధంగా గోమాంసాన్ని నిల్వ చేయడంతో పాటు, అక్రమ ఎగుమతులకు సిద్ధం చేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఆహార భద్రత, ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడేలా ఉన్నందున కోర్టు ఆదేశాలతో గోమాంసాన్ని శాస్త్రీయ విధానంలో పూడ్చివేత చేశారు. ఈ ప్రక్రియను రెవెన్యూ, పోలీస్, వెటర్నరీ అధికారుల సమక్షంలో పూర్తి చేశారు.
ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించి, పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అక్రమ వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులెవ్వరినీ వదిలిపెట్టవద్దని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మరికొందరు కీలక నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని, అక్రమ గోమాంసం వ్యాపారంపై ఈ విషయంపై పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. కాబట్టి ఈ కేసులో అనుమానితులని అందరిని ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులకు శిక్ష పడేటట్టు చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ఆదేశించినట్టు తెలుస్తుంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0