పెళ్లికొడుకుపై దాడి.. కత్తిపోట్ల వీడియో బయటకు!
మహారాష్ట్ర అమరావతి జిల్లాలో పెళ్లికొడుకుపై కత్తిపోట్ల ఘటన సంచలనం రేపింది. రిసెప్షన్ సమయంలో స్టేజ్‌పై దాడి చేసిన నిందితుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో పెళ్లికొడుకుపై దాడి చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆ ఘటనకు సంబంధించిన మరో షాకింగ్ వీడియో బయటకు వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే — వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా పెళ్లికూతురుతో పాటు పెళ్లికొడుకు సుజల్ రామ్ స్టేజ్‌పై ఫోటోలు దిగుతున్నాడు. ఆ సమయంలో అక్కడికి ఓ యువకుడు చేరి, ఒక్కసారిగా కత్తి తీసి సుజల్ తొడపై పలుమార్లు పొడిచాడు.
అక్కడున్నవారు అతన్ని ఆపేందుకు ప్రయత్నించగా, నిందితుడు తప్పించుకుని పారిపోయాడు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. ఇదే నిందితుడిని డ్రోన్ వెంబడించిన వీడియో నిన్న వైరల్ కావడం మరింత సంచలనం రేపింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0