రీల్స్ కోసం రైలు కింద పడుకున్న యువకుడు.. సెకన్ల గ్యాప్‌లో ఏం జరిగిందంటే?
ఉత్తరప్రదేశ్‌లో రీల్స్ పిచ్చితో రైలు కింద పడుకుని స్టంట్లు చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి చర్యలపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేశారు.
రీల్స్ పిచ్చితో ప్రాణాలకే ముప్పు తెచ్చుకున్న యువకుడు
1. వీల్స్ కోసం పిచ్చి పనులు చేస్తున్న యువత.
2. వీడియో వైరల్ అయింది?
3. పోలీసులు కూడా అతని వైరల్ బాగా చేశారు?
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ; సోషల్ మీడియా రీల్స్ మోజు యువతను ఎంతటి ప్రమాదకరమైన చర్యలకు దింపుతుందో మరోసారి రుజువైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కొత్వాలీ ప్రాంతంలో అజయ్ రాజ్బర్ అనే యువకుడు రీల్స్ కోసం తన ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టాడు. వేగంగా దూసుకెళ్తున్న రైలు కింద పడుకుని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసులు అజయ్ రాజ్బర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రైల్వే ట్రాక్‌లపై ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేయడం చట్టవిరుద్ధమని, ఇది తనతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చే చర్య అని పోలీసులు హెచ్చరించారు.
యువకుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, రీల్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. యువత సోషల్ మీడియా వ్యసనానికి లోనుకాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
ఈ వార్త విన్న ప్రజలందరూ వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇలాంటి పనులు చేసే ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే, ఆహారం లేని వారికి ఆహారాన్ని, రోడ్డుపైనున్న జంతువులకి ఆహారం పెడితే మంచిది కదా, మంచి పేరు మంచి వ్యూస్ వస్తాయి అని ప్రజలు భావిస్తూ ఉన్నారు.
*మరి అతడు తీసిన రీల్ మీరు చూడాలనుకుంటే కింద వీడియోలో ఉన్నది ఒకసారి చూడండి.
*అలాగే ప్రాముఖ్యమైన యొక్క ఆలోచనను మాతో పంచుకోండి.
రీల్స్ పిచ్చితో ట్రైన్ కింద పడుకున్న యువకుడు
వైరల్ అవ్వడంతో అరెస్టు చేసిన పోలీసులు
యూపీ రాష్ట్రంలోని కొత్వాలీ ప్రాంతంలో రీల్స్ మోజులో వేగంగా వస్తున్న రైలు కింద పడుకుని వీడియో చికిత్రీకరించిన అజయ్ రాజ్బర్ అనే యువకుడు
రీల్ వైరల్ అవ్వడంతో యువకుడిని అదుపులోకి తీసుకుని రిమాండుకు… pic.twitter.com/eegsjhehPe — Telugu Scribe (@TeluguScribe) December 30, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0