అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్‌కు ఏమైంది..? జొమాటో డెలివరీ బాయ్ వీడియో వైరల్!
అర్ధరాత్రి జొమాటో ఫుడ్ డెలివరీ సమయంలో కస్టమర్‌తో వివాదం జరగడంతో డెలివరీ బాయ్ ఆర్డర్‌ను తానే తినేశాడు. వీడియో వైరల్‌గా మారి పెద్ద చర్చకు దారి తీసింది.
* కస్టమర్ జొమాటో యాప్ లో ఫుడ్ ఆర్డర్.
* నైట్ 2:30 అపార్ట్మెంట్ లోనికి రాను అని బాయ్.
* కస్టమర్ vs డెలివరీ బాయ్ గా మారింది
* డెలివరీ బాయ్ వీడియో తీసి ఫుడ్ తినేశాడు?
* ఇంతకీ ఆ వీడియోలో ఏం చెప్పాడు
fourth line news : అర్ధరాత్రి ఫుడ్ డెలివరీ విషయంలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. జొమాటో డెలివరీ ఏజెంట్-కస్టమర్ మధ్య జరిగిన చిన్న వివాదం చివరికి అనూహ్యంగా మారి, ఆ వీడియో వైరల్‌గా మారింది.
ఈ ఘటనలో జొమాటో డెలివరీ పార్ట్‌నర్ అంకుర్ ఠాకూర్ తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో ఫుడ్ డెలివరీకి వెళ్లాడు. అతను అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్న తర్వాత తన వాహనాన్ని కింద వదిలి పైకి వెళ్లాలంటే దొంగతనం జరిగే అవకాశం ఉందని భయపడ్డాడు. అందుకే కస్టమర్‌ను కిందకు వచ్చి ఆర్డర్ తీసుకోమని కోరాడు.
అయితే, కస్టమర్ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. డోర్‌స్టెప్ డెలివరీ కోసం డబ్బులు చెల్లించామని, కాబట్టి ఇంటి వద్దకే ఫుడ్ ఇవ్వాల్సిందేనని అతను వాదించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్వాదంగా మారింది. కస్టమర్ దురుసుగా మాట్లాడాడని, ఆర్డర్ క్యాన్సిల్ చేస్తానని బెదిరించాడని అంకుర్ తన వీడియోలో చెప్పాడు.
కొద్దిసేపటికే ఆర్డర్ క్యాన్సిల్ అయింది. దీనిపై స్పందించిన అంకుర్ “ఇప్పుడు ఆర్డర్ రద్దయింది కాబట్టి ఈ ఫుడ్ నేనే తింటాను” అంటూ బిర్యానీ కాంబోలో ఉన్న గులాబ్ జామూన్‌ను తింటూ వీడియో తీశాడు. అదే వీడియోను అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్తా వైరల్‌గా మారింది.
ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 12 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు డెలివరీ ఏజెంట్‌కు మద్దతు తెలుపుతూ, అర్ధరాత్రి పని చేసే వారి భద్రతను కూడా అర్థం చేసుకోవాలని అంటున్నారు. కొన్ని అపార్ట్‌మెంట్లలో రాత్రి సమయంలో డెలివరీ బాయ్స్‌ను లోపలికి అనుమతించకపోవడం నిజమేనని వారు గుర్తుచేస్తున్నారు.
మరోవైపు, డోర్‌స్టెప్ డెలివరీకి డబ్బులు చెల్లించినప్పుడు కస్టమర్ కిందికి రావాల్సిన అవసరం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. సేవ కోసం డబ్బులు చెల్లిస్తే ఇంటి తలుపు వద్దకే ఫుడ్ అందించాల్సిన బాధ్యత కంపెనీదే అంటున్నారు.
జొమాటో పాలసీ ప్రకారం, కస్టమర్ అందుబాటులో లేకపోయినా లేదా డెలివరీ తీసుకునేందుకు నిరాకరించినా ఏజెంట్ కొంత సమయం వేచి చూసి ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసే హక్కు ఉంది. అయితే, ఈ సందర్భంలో ఏజెంట్ తీసుకున్న నిర్ణయం సరైందా? కస్టమర్ వాదన న్యాయమా? అన్నదానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది.
“ఆకలితో ఉన్న డెలివరీ బాయ్‌కు భోజనం దొరికింది” అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేస్తుండగా, మరికొందరు మాత్రం జొమాటో సేవలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి మొండితనం వల్ల ఒకరు భోజనం కోల్పోయారు, మరొకరు అదే భోజనంతో ఆకలి తీర్చుకున్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు జొమాటో గానీ, సంబంధిత కస్టమర్ గానీ అధికారికంగా స్పందించలేదు.
इस डिलीवरी बॉय ने तो लोगों को आपस में लड़ा दिया 😂
दरअसल हुआ यूं कि किसी ने रात के वक्त zometo पर खाना ऑर्डर किया, कुछ देर बाद डिलीवरी बॉय खाना लेकर ग्राहक के दरवाजे पर पहुंचा
लेकिन ग्राहक इतना आलसी था कि खाना लेने दरवाजे तक भी नहीं आ पाया तो डिलीवरी बॉय ग्राहक का खाना खा गया… pic.twitter.com/ImhuQ42Eh7 — Samira (@Logical_Girll) January 15, 2026
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0