యశ్ ‘టాక్సిక్’ ఇంట్రడక్షన్ వీడియో షాక్… హాలీవుడ్ రేంజ్ యాక్షన్!

కన్నడ స్టార్ యశ్ నుంచి మరోసారి ఊహించని స్థాయి యాక్షన్ వచ్చింది. ‘టాక్సిక్’ సినిమా నుంచి విడుదలైన ఇంట్రడక్షన్ వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jan 8, 2026 - 11:52
Jan 8, 2026 - 11:55
 0  4
యశ్ ‘టాక్సిక్’ ఇంట్రడక్షన్ వీడియో షాక్… హాలీవుడ్ రేంజ్ యాక్షన్!

1. టాక్సిక్' నుంచి అదిరిపోయే వీడియో

2. యశ్ బర్త్ డే సందర్భంగా రిలీజైన 2:52 నిమిషాల

3. ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాను మార్చి 19న విడుదల

4. BGM వింటుంటే మతిపోతుంది అంటున్న ఫ్యాన్స్

fourth line news : 

కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో, నేషనల్ అవార్డు విన్నర్ గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్ (రాయ్)’ సినిమా పై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. యశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఇంట్రడక్షన్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దాదాపు 2 నిమిషాల 52 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో  యశ్‌ను పవర్ ఫుల్  గ్యాంగ్ స్టార్ పాత్రలో చూపెట్టి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని పుట్టిస్తున్నారు. 

ముఖ్యంగా వీడియోలో కనిపించే హాలీవుడ్ స్థాయి యాక్షన్ కొరియోగ్రఫీ, స్టైలిష్ విజువల్స్, ఇంటెన్స్ మేకింగ్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. “ఇది ఇండియన్ సినిమా కాదు… ఇంటర్నేషనల్ సినిమా” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. యశ్ స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్, కళ్లలో కనిపించే ఆగ్రహం – అన్నీ కలిసి ఆయన పాత్రకు మరింత బలం చేకూర్చాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇక వీడియోకి ప్రాణంగా నిలిచిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేకంగా ప్రశంసలు అందుకుంటోంది. ప్రతి ఫ్రేమ్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయిన BGM యశ్ క్యారెక్టర్‌ను మరింత డేంజరస్‌గా, డామినెంట్‌గా చూపిస్తోంది. ఇదే కారణంగా ఈ సినిమా కేవలం కన్నడకే కాకుండా పాన్-ఇండియా స్థాయిలో భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది.

గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’లో యశ్ ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని కొత్త లుక్ తో  దర్శనం ఇవ్వనున్నారని సమాచారం. కథ, కథనం రెండూ చాలా రా అండ్ రియలిస్టిక్‌గా ఉండబోతున్నాయట. గీతూ మోహన్దాస్ మేకింగ్ స్టైల్‌కు యశ్ మాస్ ఇమేజ్ జత కావడంతో ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాను మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఇంట్రడక్షన్ వీడియోతోనే ఈ స్థాయిలోమంచి టాక్  రావడం చూస్తుంటే, ట్రైలర్ రిలీజ్‌కి ముందు నుంచే ‘టాక్సిక్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. 

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. యశ్ సినిమాలు అన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి అని అభిమానులు అంటున్నారు. ఏ సినిమాలోనైనా బలమైన క్యారెక్టర్ చేస్తూ రేషకుల మనసును గెలుచుకుంటాడు అని అభిమానులు ఆయన పట్ల ఉన్న ప్రేమను కనపరుస్తూ ఉన్నారు. మరి సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0