వరంగల్ సీకేఎం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల బెడద…
వరంగల్ సీకేఎం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల బెడద పెరుగుతోంది. పిల్లలు, బాలింతలకు ప్రమాదం పొంచి ఉందని పేషెంట్ బంధువులు ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వైరల్ వీడియోతో విషయం పెద్ద చర్చగా మారింది.
* ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు వీరంగం
* వరంగల్ సీకేఎం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల
* హాస్పటల్లో పిల్లలు , బాలింతలు గాయపరుస్తున్న ఎలుకలు
* అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు అని ఫిర్యాదు
* వీడియో వైరల్ గా మారింది
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
వరంగల్ సీకేఎం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల సంచనిస్తున్నాయి. హాస్పటల్లో పిల్లలు , బాలింతలు గాయపరుస్తున్న ఎలుకలు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అని పేషంట్ బంధువులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా పేషంట్ బంధువులు ఎలుకలు దాడిలో పిల్లలకి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి అని అధికారులకు ఫిర్యాదు చేసిన కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా సిగ్గుచేటుగా ఉంది అని పేషంట్ బంధువులు ఆరోపిస్తున్నారు.
ఎలుకల బెడదతో బాలింతలు, వారి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారని, ఇప్పటికైన ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్న పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులు. అయినా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ విధంగా ఉండాలి ! కానీ ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి. ఈ విధంగా ఆసుపత్రులు ఉంటే పేదవారు ఏ విధంగా వైద్యం చేయించుకుంటారు. వాళ్ల దగ్గర డబ్బులు లేవు అనే కదా ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లకుండా గవర్నమెంట్ కల్పిస్తున్న హాస్పిటల్ కి వస్తున్నారు అలాంటప్పుడు ఆసుపత్రులు చాలా నీటుగా ఉంచుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉంది.
ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్రభుత్వ ఆస్పటల్ ఇంత దారుణంగా ఉంటే ఎలా అని మండిపడుతున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూడండి. అలాగే ఈ వార్తపై మీయొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
అసలు ఇది ఆసుపత్రి అంటారా!
వరంగల్ సీకేఎం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల స్వైరవిహారం
పసి పిల్లలను, బాలింతలు గాయపరుస్తున్న ఎలుకలు
వరంగల్ నగరంలోని సీకేఎం ప్రభుత్వ ఆసుపత్రిలో విచ్చలవిడిగా సంచరిస్తూ, పసి పిల్లలు, బాలింతలను గాయపరుస్తున్న ఎలుకలు
గతంలో ఎలుకల దాడిలో పిల్లలు తీవ్ర… pic.twitter.com/xpvMj10MFQ — Telugu Scribe (@TeluguScribe) December 4, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0