భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. వినియోగదారులకు షాక్!
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పావుకేజీ రూ.30కి తగ్గడం లేదు. మొంథా తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతినడంతో ధరలు బెంబేలెత్తుతున్నాయి. — Fourth Line News
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణంగా రూ.20–30 మధ్య లభించే కూరగాయలు ఇప్పుడు పావుకేజీకి రూ.30 కంటే తక్కువకు దొరకడం లేదు. అంటే కిలో ధర రూ.100 నుంచి ₹120 వరకు పెరిగింది.
రైతు బజార్లతోపాటు వారపు సంతల్లో కూడా ధరలు అదుపు తప్పాయి. ఆకుకూరలు, టమోటా, ఉల్లిపాయ, బీరకాయ వంటి సాధారణ కూరగాయల రేట్లు కూడా పెరిగిపోవడంతో వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతినడం, సరఫరా తగ్గిపోవడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0