ఏషియా కప్‌లో వైభవ్ సూర్యవంశీ సెన్సేషన్ — 32 బంతుల్లో శతకం
వైభవ్ సూర్యవంశీ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో UAE-Aపై 32 బంతుల్లో శతకం కొట్టి భారత క్రికెట్‌లో అరుదైన రికార్డు సృష్టించారు. ఫాస్టెస్ట్ T20 సెంచరీ చేసిన ఇండియన్స్ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.
మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో యువ భారత క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఘనకీర్తి సొంతం చేసుకున్నారు. UAE-Aపై ఆడిన మ్యాచ్‌లో అతను కేవలం 32 బంతుల్లోనే శతకం సాధించి అంతర్జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించాడు
ఈ ఇన్నింగ్స్‌తో ఫాస్టెస్ట్ T20 సెంచరీ చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో సూర్యవంశీ రెండో స్థానానికి చేరుకున్నారు. మొదటి స్థానంలో 28 బంతుల్లో శతకాలు సాధించిన ఉర్విల్ పటేల్, అభిషేక్ ఉన్నాయి.
IPL, యూత్ ఇంటర్నేషనల్స్, ఇండియా-Aలో ఇప్పటికే అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చిన సూర్యవంశీ, ఈ మ్యాచ్‌తో తన ప్రతిభను మరోసారి రుజువు చేసుకున్నాడు. ఈ పోరులో టీమ్ IND-A 20 ఓవర్లలో భారీగా 297/4 పరుగులు చేసింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0