జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో ఓడించి...

టీ20 ప్రపంచ కప్‌లో జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. బ్లెస్సింగ్ ముజర్బానీ నాలుగు వికెట్లతో మెరిసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

flnfln
Feb 13, 2026 - 15:24
 0  3
జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో ఓడించి...

* జింబాబ్వే vs ఆస్ట్రేలియా 

* ఊహించని ఫలితాలు ఎదుర్కొంది ఆస్ట్రేలియా 

* ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది

* ఆస్ట్రేలియా ఆల్ అవుట్ ! 

 fourth line news: టీ20 ప్రపంచ కప్‌లో ఒక అద్భుతం మీరు ఎప్పుడైనా చూసారా! ఆస్ట్రేలియా జట్టును జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా కుప్పకూలిపోయింది. 19.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. 

ఆస్ట్రేలియా ఆటగాడు మాట్ రెన్‌షా 65 పరుగులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (31) మంచి భాగస్వామ్యం అందించాడు. అయినప్పటికీని కూడా జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజర్బానీ 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. బ్రాడ్ ఇవాన్స్ మూడు, మసకద్జ, బర్ల్ చెరో వికెట్ తీశారు.

మొదటి ఐదు ఓవర్లలో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 29 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత మాట్ రెన్‌షా, మ్యాక్స్‌వెల్ 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరి భాగస్వామ్యం లేకుంటే ఆస్ట్రేలియా మరింత తక్కువ స్కోరుతూనే ఆస్ట్రేలియా ఓడిపోవలసి వచ్చేది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.