ఉపేంద్ర ఎమోషనల్ వ్యాఖ్యలు: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’పై ప్రశంసలు – చిరంజీవితో

కన్నడ స్టార్ ఉపేంద్ర, రామ్ నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా గురించి ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. రామ్ నటన, దర్శకుడి విజన్, కథలోని భావోద్వేగం గురించి ప్రశంసలు వ్యక్తం చేశారు. త్వరలో చిరంజీవితో సినిమా చేయాలన్న తన కలను కూడా వెల్లడించారు.

flnfln
Nov 26, 2025 - 10:49
 0  4
ఉపేంద్ర ఎమోషనల్ వ్యాఖ్యలు: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’పై ప్రశంసలు – చిరంజీవితో

* ఉపేంద్ర ఇదొక ఎమోషనల్ ఉన్న అందమైన సినిమా 

* రామ్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు 

* మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక్క సినిమా 

* హీరో హీరోయిన్ మధ్య ప్రేమ కథ సూపర్ 

fourth line news : రామ్ పోతినేని హీరోగా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా. అలాగే ఈ సినిమాలోనే కన్నడ స్టార్ అయిన ఉపేంద్ర నటించడం సినిమాకి హైట్ తెప్పించినట్టు అయింది. ఉపేంద్ర ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా గురించి కొన్ని విశేషాలను పంచుకున్నారు. ఈ సినిమా గురువారం విడుదలవుతున్న క్రమంలో ఆయన మీడియాతో ఈ విధంగా మాట్లాడారు. ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంపై ఇది ఒక అద్భుతమైన ఎమోషన్ ఉన్న సినిమా అని ఒక స్టార్ హీరో అతని ప్రాణంగా అభిమానించే అభిమానుల మధ్య జరిగే కథ అని ఆయన చెప్పి అభిమానుల్లో సినిమా పైన ఎమోషన్ పెంచడం జరిగింది. 

దర్శకుడు మహేశ్‌బాబు హీరో అభిమాని మధ్య ఉండే ప్రేమ బంధాన్ని చాలా కొత్తగా అద్భుతంగా ఈ సినిమా తీయడము జరిగింది అని ఉపేంద్ర దర్శకున్ని మెచ్చుకున్నారు. దర్శకుడు ఈ సినిమా నాకు చెప్పినప్పుడు నేను పూర్తిగా ఆ సినిమాను ఊహించుకున్నాను అని ఆయన మనసులోని మాట బయటికి చెప్పారు. రామ్ ఒక గొప్ప నటుడు అయినప్పటికిని కూడా ఒక హీరోకి ఉన్న అభిమాని ఏ విధంగా ప్రేమ చూపిస్తాడు పూర్తిగా ఈ సినిమాలో రామ్ నటించిన. ఒక అభిమాని హీరో దగ్గర ఎలా అయితే అమాయకంగా హీరోను చూసినప్పుడైతే ఆ ఫీలింగ్స్ అన్ని రామ్ ఈ సినిమాలో కనపరిచాడు అని ఉపేంద్ర సినిమా గురించి ఆశక్తికరమైన విషయాలను బయటపెట్టారు. అలాగే హీరో హీరోయిన్ మధ్య ఉండే ప్రేమ కథ ప్రతి అభిమాని హృదయాలను తాకిద్ది అని ఆయన చెప్పారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారి ప్రేమ అది చూపెట్టే విలువలు బాగున్నాయని ఇంత మంచి ఎమోషనల్ సినిమాను నిర్మిస్తున్నందుకు వారికి అభినందనలు అని ఆయన వెల్లడించారు.

ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా గురించి కొన్ని ఆశక్తికరమైన విషయాలు చేసిన తర్వాత ఉపేంద్ర తన మనసులో ఉన్న వ్యక్తి గత అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. తను సినిమాలోనికే రానప్పుడు చిరంజీవి సినిమాలను మొదటి రోజు మొదటి షో చూసే వాడినని ఆయన చెప్పారు. చిరంజీవి గారి సినిమాకు దర్శకత్వం వహించాలని అది నా కళ అని త్వరలోనే అది నెరవేరబోతుంది అని ఆయన వ్యక్తం చేశారు. 

మరి చూడాలి మరి రాబోయే కాలంలో వీరిద్దరి యొక్క కాంబినేషన్ ఎలా ఉంటుందో ప్రేక్షకులు అనుకుంటున్నారు. 

* ఎంత ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కోసం ఎదురుచూస్తూ ఉన్నారు 

* రామ్ సినిమాలో మీకే సినిమా అంటే ఇష్టం 

* కన్నడ స్టార్ ఉపేంద్ర సినిమాలో మీకు ఏ సినిమా అంటే ఇష్టం 

* ఉపేంద్ర సార్ కళ నెరవేరుతుందా ? చిరంజీవి గారితో సినిమా చేస్తారా? 

* మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 

* fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.