ప్రియుడి మోజులో పడి భర్తను ముక్కలు చేసిన భార్య: యూపీలో ఒళ్లు గగుర్పొడిచే ఘాతుకం!

యూపీలోని సంభాల్ జిల్లాలో భర్తను హత్య చేసిన భార్య ఉదంతం కలకలం రేపింది. ప్రియుడితో కలిసి భర్త రాహుల్‌ను ముక్కలుగా నరికి మురికి కాలువలో పడేసిన రూబీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

flnfln
Dec 23, 2025 - 10:38
 0  15
ప్రియుడి మోజులో పడి భర్తను ముక్కలు చేసిన భార్య: యూపీలో ఒళ్లు గగుర్పొడిచే ఘాతుకం!

1. అక్రమ సంబంధం వల్ల ఒక ప్రాణం బలి అయింది ?
2. సొంత భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది అని.
3. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను .
4. పోలీసులకి ఆమె ఫిర్యాదు చేసింది. 
5. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన పోలీసులు షాక్ అయ్యారు.
6. పూర్తి వివరాల్లోనికి వెళ్తే. 

 ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ; ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న సమయంలో భర్త అడ్డుపడ్డాడనే కారణంతో భార్య దారుణానికి దారుణానికే తెగించింది. . యూపీ సంభాల్‌ జిల్లాకు చెందిన రాహుల్‌ (38) హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. రాహుల్‌ డిసెంబర్‌ 10 నుంచి కనిపించకపోవడంతో అతని భార్య రూబీ పోలీసులకు మిస్సింగ్‌ ఫిర్యాదు చేసింది.

అయితే డిసెంబర్‌ 15న స్థానికంగా ఉన్న మురికి కాలువలో తల, చేతులు, కాళ్లు లేని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు లేని పరిస్థితుల్లో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో రాహుల్‌ భార్య రూబీ ప్రవర్తనపై అనుమానంవచ్చింది వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

పోలీసుల విచారణలో రూబీ షాకింగ్‌ నిజాలను వెల్లడించింది. తన ప్రియుడు గౌరవ్‌తో కలిసి భర్తను ఐరన్‌ రాడ్లతో కొట్టి హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది. భర్త తనను మందలించడం, అక్రమ సంబంధంపై గొడవపడటమే హత్యకు కారణమని తెలిపింది. హత్య అనంతరం ఆధారాలు దొరకకుండా ఉండేందుకు మృతదేహాన్ని ముక్కలు చేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసులకు వివరించింది.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు రూబీతో పాటు ఆమె ప్రియుడు గౌరవ్‌ను అరెస్ట్‌ చేసి, హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసును పక్కా ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈమధ్య అక్రమ సంబంధాలు పెరగటం వల్ల హత్యలు కూడా బాగా పెరుగుతున్నాయి అని అధికారులు వెల్లడించారు. ఉన్న భర్తతోను ఉన్న భార్యతోను కలిసే మెలిసి ఉండకుండా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల భార్యాభర్తలు చంపడం లేక భర్త భార్యను చంపటం జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మీకు మీ భార్య గాని, భర్త గాని ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చి మీకు నచ్చిన వ్యక్తితో ఉండొచ్చు , అంతేగాని హత్యలు చేసి జైలుకి రావద్దు అని అధికారులు వెల్లడిస్తున్నారు.  ఫోర్త్ లైన్ న్యూస్

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.