ఆర్టీసీ డ్రైవర్ సతీష్ ఆకస్మిక మరణంపై కుటుంబ సభ్యుల అనుమానాలు
ఆర్టీసీ డ్రైవర్ సతీష్ ఆకస్మిక మరణంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఉదయం పరీక్షల్లో సమస్యలేదని చెప్పిన డాక్టర్లు, కొన్ని గంటల్లోనే మరణం ప్రకటించడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Fourth Line News వివరాలు చదవండి.
* తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ సతీష్ మృతి పై అనుమానాలు
* నవంబర్ 30 తేదీన యాక్సిడెంట్ అవడం వల్ల కాలికి గాయం
* ఆర్టీసీ ఆసుపత్రిలో చేరిన సతీష్
* కాళ్ళకి కట్టు కట్టే చికిత్య అందిస్తున్న డాక్టర్లు
* ఉదయం 10 గంటలకు అన్ని పరీక్షలు చేసే ఎలాంటి సమస్య లేదు అని వెల్లడి
* మూడు గంటలకి సతీష్ మృతి చెందాడు అని చెప్పడం
* బంధువులు ఆర్టీసీ నాయకులు అనుభవం లేని డాక్టర్లు వల్లనే సతీష్ చనిపోయారు అంటూ ఫిర్యాదు.
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news : తెలంగాణ ఆర్టీసీ బస్ డ్రైవర్ గా సేవలందిస్తున్న సతీష్. సతీష్ హైదరాబాద్ పంజాగుట్ట లో నివాసం ఉంటూ తెలంగాణ ఆర్టీసీ బస్ డ్రైవర్ గా పని చేస్తూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు. అయితే పోయిన నెల 30వ తేదీన ఆక్సిడెంట్ అవ్వడంతో కాలికి గాయం అయింది. కాలికి గాయం కావడంతో సతీష్ ఆర్టిసి ఆసుపత్రిలో చేరాడు.
ఆస్పత్రి సిబ్బంది సతీష్ కాలికి సిమెంట్ కట్టు కట్టి చికిత్స అందిస్తూ అకస్మాత్తుగా ఈరోజు చనిపోయాడని తెలిపిన వైద్యులు. సతీష్ ను ఉదయం 10 గంటలకు డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి ఎలాంటి సమస్య భయము లేదని చెప్పి ఆపరేషన్ థియేటర్ లోనికి తీసుకువెళ్లారని బంధువులు తెలిపారు. అయితే మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎన్నిసార్లు అడిగినా కూడా డాక్టర్లు ఎలాంటి సమాధానము చెప్పలేదు. అయితే బంధువులు డాక్టర్లన్నీ నిలదీయడంతో డాక్టర్లు సతీష్ మృతి చెందినట్లు నిర్ధారించారని తెలిపిన తోటి కార్మికులు.
ఉదయం 10 గంటలకు ఎలాంటి సమస్య లేదు అని చెప్పిన డాక్టర్లు ఇప్పుడు చనిపోయారు అని చెప్పటం బంధువులకి ఆశ్చర్యం కలిగించింది. ఎలాంటి అనుభవం లేని డాక్టర్లతో ఆపరేషన్ చేయడం వల్లనే సతీష్ మృతి చెందాడు అని ప్రభుత్వ ఆర్టీసీ ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్న ఆర్టీసీ సంఘం నాయకులు కుటుంబ సభ్యులు. అయిన ఇంత నిర్లక్ష్యంగా ఉండటం చాలా తప్పు అని ఈ వార్త తెలిసిన వారు అంటున్నారు. ఈ వార్త గురించి డాక్టర్లు చేసిన ఆపరేషన్ గురించి మీ యొక్క ఆలోచనను తెలుపండి.
fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0