ట్రంప్ వ్యాఖ్యలకు కొలంబియా అధ్యక్షుడి సవాల్.... వచ్చి నన్ను పట్టుకో ...?
ట్రంప్ లాటిన్ అమెరికాపై చేసిన వ్యాఖ్యలకు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఘాటుగా స్పందించారు. భయపెట్టే రాజకీయాలు కాదు, ముఖాముఖి చర్చే పరిష్కారమని స్పష్టం చేశారు.
* ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కొలంబియా అధ్యక్షుడు ఫైర్
* ముఖాముఖిగా మాట్లాడుకుందాం భయపడేదిలే
* అంతర్జాతీయ రాజకీయాలలో మరో మలుపు?
fourth line news : ట్రంప్ ఇటీవలే లాటిన్ అమెరికా దేశాలపై చేసిన కట్టిన మాటలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వెనుజులా నాయకత్వంపై అమెరికా చర్యలు, ఆర్థిక ఆంక్షలు, అరెస్టులు పై హెచ్చరికలతో ట్రంప్ ప్రభుత్వం దూకుడు చూపుతుందన్న విమర్శలు ప్రపంచ దేశాలలో నుంచి వస్తూ ఉన్నాయి. అలాగే లాటిన్ అమెరికా దేశాలకు కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.
అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కొలంబియా అధ్యక్షుడు గుస్తావో కఠినంగా ట్రంప్ పై అమెరికాపై స్పందించడం జరిగింది. బెదిరింపులతో భయపెట్టడం రాజకీయం కాదు. దాడులు అక్రమాలు సమస్యలకు పరిష్కారము కా. నిజ నిజాలు తెలుసుకోవాలి అంటే ముఖాముఖిగా చర్చించుకుందాం అంటూ ట్రంప్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే తానే ప్రత్యక్షంగా మాట్లాడటానికి సిద్ధం భయపడి ప్రశ్న లేదు అంటూ స్పష్టం చేశారు.
కొలంబియా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చి మొదలైంది. ప్రతి దేశంలోనూ అమెరికా జోక్యం పెరుగుతుందన్న భావన ఇప్పటికి అనేక దేశాల్లో ఉంది అనే విశ్లేషకులు అంటున్నారు. మరి అంతర్జాతీయంగా రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరుగుతాయో ఇంకొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. 2026 స్టార్ట్ అయిందో లేదో యుద్ధాలు మాత్రమే దూకుడుగా ముందుకి సాగుతూ ఉన్నాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0