“నేనే వెనిజులా అధ్యక్షుడిని” – ట్రంప్ పోస్ట్‌తో ప్రపంచ రాజకీయాల్లో సంచలనం
వెనిజులా అధ్యక్షుడినని ట్రంప్ చేసిన సంచలన ప్రకటన ప్రపంచ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. ట్రూత్ సోషల్ పోస్ట్ వెనుక నిజమేంటో తెలుసుకోండి.
* అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
* ప్రపంచ రాజకీయాలను ఊపేస్తున్న ఒక పోస్ట్
* నేనే వెనిజులా అధ్యక్షుడును అనే ట్రంప్ ప్రకటన
* ఇది నిజమా ఎంతవరకు ఇది సాగుతుంది?
* పూర్తి వివరాలు కింద ఉన్న సంవత్సరం ద్వారా తెలుసుకోండి.
fourth line news: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనిజులా అధ్యక్షుడైన నికోలాస్ మధురను అమెరికా బలగాలు అరెస్ట్ చేసిన విషయం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. దీంతో వెనిజులా తాత్కాలికంగా అధ్యక్ష పదవి డెల్సి రోడ్రిగ్జ చేపట్టారు. 90 రోజులు పాటు అధికారంలో ఉంటారని వెనిజులా రక్షణ మంత్రి వెల్లడించారు.
అయితే అమెరికా అధ్యక్షుడు ఈ విషయంపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనిసుల అధ్యక్షుని తానేనని తన ట్రూత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టడం జరిగింది. వికీపీడియాను పోలిన ఎడిటెడ్ ఫొటోను ఆయన పంచుకున్నారు. ఆ పోస్టులో రోనాల్డ్ ట్రంప్ వెనిజులా యాక్టివ్ ప్రెసిడెంట్గా చూపించారు. అయితే ట్రంప్ ఈ ఫోటో కింద ఈ ఏడాది జనవరి నుంచి వెనిజులాకు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్నట్టుగా ఉంది. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో అని ప్రజలందరూ ఆశక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలలో ఇది ఇప్పుడు ఏ విధమైన దారికి పాల్పడుతుందో అని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.
అయితే మరో వైపైతే వెనిజులా ప్రతిపక్ష నేత, నోబుల్ శాంతి బహుమతి గ్రహీత మచాడోకు ట్రంప్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అయితే మచాడోకు ప్రజల మద్దతు లేదని, ఆమెకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించలేం అని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సంచలంగా మారింది. నిజంగా మరి వెనుజులా అధ్యక్షుడిగా ట్రంప్ అవుతారా లేకపోతే ప్రజలను మభ్యపెట్టడానికా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0