రూ.240 కోట్లు గెలుచుకున్నాడు మన తెలుగు యువకుడు
యూఏఈ లాటరీలో రూ.240 కోట్లు గెలుచుకున్న బొల్ల అనిల్ కుమార్ ఖమ్మం జిల్లా యువకుడు. తల్లి పుట్టినరోజు తేదీతో టికెట్ కొనగా అదృష్టం వరించింది.
అదృష్టం ఎప్పుడు, ఎక్కడ మెరిసిపోతుందో ఎవరికీ తెలియదు. ఈసారి ఆ అదృష్టం మన తెలుగు యువకుడిపై పడింది. యూఏఈ లాటరీలో 100 మిలియన్ దిర్హమ్స్ (భారత కరెన్సీలో సుమారు రూ.240 కోట్లు) గెలుచుకున్న వ్యక్తి ఖమ్మం జిల్లాకు చెందిన బొల్ల అనిల్ కుమార్.
భీమవరం గ్రామానికి చెందిన రైతు దంపతులు మాధవరావు, భూలక్ష్మిల కుమారుడైన అనిల్, స్థానికంగా ప్రాథమిక విద్య పూర్తి చేశారు. తర్వాత హైదరాబాద్, చెన్నై నగరాల్లో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేశారు. ఏడాదిన్నర క్రితం ఉపాధి కోసం యూఏఈకి వెళ్లిన ఆయన, అక్కడే ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు.
తల్లి పుట్టినరోజు 11వ తేదీ కావడంతో అదే నంబర్ ఉన్న టికెట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అదృష్టం నిజంగానే ఆయనవైపే ఉందని ఈ గెలుపుతో మరోసారి రుజువైంది. ఈ వార్తతో అనిల్ కుటుంబం ఆనందంతో మునిగిపోయింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0