రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలర్ట్: వెంటనే ఈ పని చేయకపోతే ఇకపై బియ్యం బంద్..!"
తెలంగాణలో రేషన్ కార్డు e-KYC ప్రక్రియపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. e-KYC పూర్తి చేయని వారికి రేషన్ సరుకులు నిలిపివేసే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఫోర్త్ లైన్ న్యూస్ కథనం చదవండి.
1. మీ రేషన్ కార్డు కి...... ఇది చేయించారా?
2. చేయించలేదా కచ్చితంగా ఈ సమస్యలు మీరు ఉంటారు.
3. ప్రభుత్వం ఏం చెప్పింది దీని గురించి?
4. లక్షలాదిమంది e-KYC చేయించుకోలేదు అని ప్రభుత్వం చెబుతుంది?
5. రేషన్ బియ్యం, ఇతర వస్తువులు ఆపేస్తారంట?
6. పూర్తి విషయాలు తెలియాలి అంటే కింద ఉన్న సమాచారాన్ని చదవండి.
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ; మీ రేషన్ కార్డులకు e-KYC చేపించారా ! ఎందుకు ఇది చేయాలో మీరు తెలుసుకోవాలి: నకిలీ రేషన్ కార్డులకు చెక్ పెట్టడం కోసం మరియు అర్హులైన లబ్దదారులకే ప్రభుత్వ పథకాలు అందించే విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డులు e-KYC ప్రక్రియను మొదలుపెట్టింది కానీ ఈ ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకి సాగడము లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా లక్షలాదిమంది e-KYC పూర్తి చేయకపోవడంతో మరోసారి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా e-KYC చేపించుకోవాలి అని అధికారులు వెల్లడిస్తున్నారు. కుటుంబంలో ఒక్కరు మాత్రమే e-KYC చేయించుకుంటే సరిపోదు కార్డులో ఉన్న ప్రతి వ్యక్తి e-KYC చేపిచ్చుకోవాలి అని తెలిపారు. దీనివల్లనే మీ అందరికీ బియ్యం, ఇతర సరుకులు పంపిణీ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
కొత్తగా రేషన్ కార్డులు పొందుకున్న వాళ్లు కూడా తప్పనిసరిగా రేషన్ దుకాణానికి వెళ్లి తమ ఆధార్ తో బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలని ప్రభుత్వం తెలియజేస్తుంది. e-KYC పూర్తిగా కాకపోతే రేషన్ సరుకులు తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉందని అధికారులు ప్రజలకు పూర్తి అవగాహన కలిగిస్తున్నారు.
నిజానికి గ్రామ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడం, మరియు పట్టణంలో పని ఒత్తిడి కారణంగా చాలామంది ఇప్పటికీ ప్రక్రియను పూర్తి చేయలేదు అని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనితో ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాల్లో నిర్వహిస్తూ రేషన్ దుకాణాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం నిర్ణయించిన గడుపులోపే e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి అని చివరి నిమిషాలలో సంస్థలు ఇద్దరు కాకుండా ముందుగానే ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే నకిలీ కార్డులు ఎరువేత ప్రారంభించాలి అని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.
*మరి మీరు e-KYC చేయించారా లేదా?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0