రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా? ప్రభుత్వం కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు శుభవార్త! సంక్రాంతి లోపు రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరానికి రూ. 6,000 చొప్పున కోటిన్నర ఎకరాలకు పెట్టుబడి సాయం అందనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
1. కోటిన్నర ఎకరాల సాగు భూములకు రైతు భరోసా.
2. సంక్రాంతి లోపు చేయాలి అని ప్రభుత్వం?
3. ఎకరానికి 6000 రెండు విడతలుగా ఇవ్వనున్న ప్రభుత్వం.
4. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోనే?
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ; రైతులందరికీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక శుభవార్తను తెలిపింది. గత సంవత్సరము ఎలా అయితే రైతు భరోసా అందించిందో, అదేవిధంగా ఈసారి కూడా దాదాపు కోటిన్నారా ఎకరాల సాగుభూములకు రైతు భరోసా ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
యాసంగి సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు ప్రభుత్వం కాంగ్రెస్లోపు రైతు భరోసా నగదును రైతుల బ్యాంకులో ఖాతాలో వెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారము అందుతుంది. ఈ రైతు భరోసా వల్ల రైతులకి ప్రాముఖ్యంగా విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరతలకు రైతుకు ఆర్థికంగా సహాయపడుతుంది అని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
ఈ రైతు భరోసా సాకు జరుగుతున్న భూములకు మాత్రమే వర్తిస్తుంది అని అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే అర్హులైన భూముల లెక్కలు విషయంలో ఇంకా స్వస్థత రాలేదు అని అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. భూముల వివరాలను పరిశీలించే డేటా పూర్తి చేసి త్వరగా పనులను కొనసాగించునున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ రైతు భరోసా పథకం కింద ఎకరానికి 6000 చొప్పున సంవత్సరానికి రెండు విడతల్లో మొత్తం 12,00 నగదు రైతులకే అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ డబ్బు నేరుగా రైతులు బ్యాంకు ఖాతాలో జమ చేయడం వల్ల మధ్యవర్తులు లేకుండా పూర్తిగా రైతుకు లాభం కలిగేటట్టు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఈసారి కూడా రైతులు రైతు భరోసా పథకాన్ని ద్వారా లబ్ధి పొందుతారు అని అధికారులు చెబుతున్నారు. రైతు ఆదాయము పెరుగుతుంది అని ప్రభుత్వ ఆశాభావాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రైతు భరోసా వల్ల రైతు కష్టాలు తగ్గుతాయి అని అన్నదాత సుఖంగా ఉంటాడు అని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు.
*ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం మీకు ఎలా అనిపించింది నిజంగా రైతులకి ఈ పథకం ఉపయోగపడుతుందా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫోర్త్ లైన్ న్యూస్
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0