తెలంగాణలో భారీ నోటిఫికేషన్: 14,000 కానిస్టేబుల్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణలో 14,000 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి డీజీపీ శివధర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఖాళీల వివరాలు ప్రభుత్వానికి పంపామని, త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
1. తొందరలోనే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్?
2. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 3 నోటిఫికేషన్లు వచ్చాయి.
3. తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి శుభవార్త
తెలంగాణలో నిరుద్యోగులు అందరికీ ఒక శుభవార్త తెలిపిన డిజిపి శివధర్ రెడ్డి . ఏంటి ఆ శుభవార్త అంటే తెలంగాణ రాష్ట్రంలో 14 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇప్పటికే ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపమని ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తాము అని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం మూడు సార్లు కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో విడుదల అవ్వడంతో పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధపడుతున్న నిరోద్యోగులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పటివరకు 2016, 2018, 2022, సంవత్సరాలలో మూడుసార్లు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఎవరైతే పోలీసు ఉద్యోగం సాధించాలి అనుకొని కష్టపడుతున్నారో వారందరికీ నోటిఫికేషన్లో లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ఈసారి తప్పకుండా కానిస్టేబుల్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేస్తాము అని డీజీపీ శుభవార్త యువత అందరికీ తెలియజేశారు.
పోస్టులు విడుదల అయిన వెంటనే భార్య సంఖ్యలో పోస్టులు భర్తీ చేయడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, రాష్ట్ర పోలీస్ వ్యవస్థ బలోపేతం అవుతుంది అని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేస్తాము. యువత అందరూ సిద్ధంగా ఉండి పోలీస్ శాఖలో జాబ్ సంపాదించాలి అని యువత అందర్నీ ప్రోత్సాహపరిచారు.
ఇప్పటికే చాలామంది యువత ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో డిజిపి మంచి శుభవార్త తెలిపే తెలంగాణ యూత్ అందరికీ సంతోషాన్ని కలగజేశారు. ఇంకా అన్ని రంగాలలోనూ ఖాళీగా ఉన్న ప్లేసులల్ల ఉద్యోగాల నోటిఫికేషను విడుదల చేసి తెలంగాణ యువత అందరిని ప్రోత్సహించాలి అని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు.
*మీలో ఎవరైనా పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ వార్తను వారికి షేర్ చేయండి?
*ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0