శబరిమల ఆలయంలో భక్తురాలు మృతి
శబరిమలలో భక్తుల భారీ రద్దీ మధ్య 58 ఏళ్ల మహిళ మృతి చెందడంతో కలకలం. రెండు లక్షల మంది 45 గంటల్లో దర్శనానికి రావడంతో క్యూలైన్లు అదుపు తప్పాయి. ముందస్తుగా ఏర్పాట్లు చేయకపోవడంపై కేరళ హైకోర్టు దేవస్థానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
1. శబరిమల ఆలయంలో భక్తురాలు మృతి
2. రద్దీ ఎక్కువగా పెరగడం వల్ల
3. 45 గంటల్లో రెండు లక్షల మంది భక్తులు...
4. మృతురాలు స్వగృహానికి పంపించారు
5. ఆరు నెలల ముందే అన్ని ప్లాన్స్ చేసుకోవాలి కదా ?
శబరిమల ఆలయములో భక్తురాలు మృతి చెందటం జరిగింది. అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల రద్దీ పెరిగింది. దాదాపుగా దర్శనం కోసం 10 గంటల సమయం పడుతుంది.
దర్శనం కోసం క్యూలో లైన్లో వేచి ఉన్న 58 ఏళ్ల మహిళ శ్రుహ కోల్పోయి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు కోజికోడ్ జిల్లాలోని కోయిలాండికి చెందినవారుని చెప్పడం జరిగింది. ఆమె మృత దేహాన్ని శబరిమల దేవస్థానం బోర్డు అంబులెన్స్ లో స్వగ్రామానికి తరలించడం జరిగింది. శబరిమల దేవస్థానం తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం చేయడము జరిగింది. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని హెచ్చరించడం జరిగింది. దేవాలయంలోని భక్తులు రద్దీ నిర్వహణ సరిగ్గా లేదని దేవస్థానంపై ఆగ్రహము చెందింది కేరళ హైకోర్టు . పరిస్థితిని అదుపు చేయకపోతే విపత్తు తప్పదు అని చెప్పింది.
అలాగే దేవస్థానం తెరిచిన 48 గంటలకే దాదాపు రెండు లక్షల మంది భక్తులు దేవస్థానానికి చేరుకున్నారు . ఎవరు ఊహించని రీతిలో రద్దీ పెరిగింది. చాలామంది పసిపిల్లలు రావడం కూడా జరిగింది. భక్తులందరిని నియంత్రించేందుకు అక్కడున్న పోలీసులు , సిబ్బంది ఇబ్బంది పడ్డారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది అని ఆరు నెలల ముందే అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకొని ఉండాల్సింది అని కోర్టు తెలపడం జరిగింది. దీనికి శుక్రవారం లోపు సమాధానము తెలపాలని సూచించింది కేరళ హైకోర్టు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0