CSK కెప్టెన్గా సంజూ శాంసన్ ! ఇది నిజమేనా !?
CSKలో సంజూ శాంసన్ చేరికతో కెప్టెన్సీ చర్చలు మళ్లీ రేగాయి. ధోనీ తర్వాత జట్టును నడిపేది సంజూనేనా? జడేజా నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలపై విశ్లేషణ.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సంజూ శాంసన్ చేరిక అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది.
ఇక ధోనీ తర్వాత సీఎస్‌కే పగ్గాలు ఎవరి చేతిలో ఉండబోతాయన్న సందేహానికి ఇదే సమాధానమా? అనే చర్చ నడుస్తోంది.
lధోనీ నుంచి రుతురాజ్ గైక్వాడ్‌కి కెప్టెన్సీ అప్పగించి… మళ్లీ కొన్ని మ్యాచ్‌లకు MSD బరిలోకి దిగిన సందర్భం ఇంకా తాజాగా ఉంది. అందుకే జట్టుకు దీర్ఘకాల నాయకత్వం కావాలన్న ఆలోచనతోనే సంజూను తీసుకున్నారన్న అభిప్రాయాలు పుకార్ల రూపంలో గట్టిగా వినిపిస్తున్నాయి.
అదే సమయంలో, జట్టు భవిష్యత్తు కోసం జడేజాను వదులుకోవడమే సీఎస్‌కే చేసిన అతిపెద్ద నిర్ణయమని విశ్లేషకులు అంటున్నారు.ఈ సమీకరణలో సంజూనే అత్యంత స్థిరమైన కెప్టెన్సీ పరిష్కారమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0