భారత్ చేతిలో ఓటమి.. బాబర్, షాహీన్లపై షాహిద్ అఫ్రీది ఫైర్! ఆ ముగ్గురినీ తీసేయాలంటూ సంచలన వ్యాఖ్యలు.
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమిపై మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్‌లను జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
* పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఫైర్
* ఇండియాతో మ్యాచ్ ఎలా ఓడిపోయారు అంటూ
* నాకే అవకాశం వస్తే ఆ ముగ్గురిని తీసేస్తా!
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : పాకిస్థాన్ జట్టుపై మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ చేతిలో ఓటమి తర్వాత జట్టు ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, అవకాశం వస్తే బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్లను తప్పించేస్తానని స్పష్టం చేశారు.
ఒక టీవీ డిబేట్‌లో మాట్లాడిన అఫ్రీది, జట్టులో కొత్త ఆటగాళ్లకు తప్పకుండా అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సీనియర్ ప్లేయర్లు నిరాశపరుస్తుంటే, యువ ఆటగాళ్లను బెంచ్‌కే పరిమితం చేయడం ఎందుకని ప్రశ్నించారు. కనీసం నమీబియాతో జరిగే మ్యాచ్‌లోనైనా కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని సూచించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0