వెయిటర్ అవతారంలో సంజీవ్ కపూర్ – బోమన్ ఇరానీ ఫన్నీ రిప్లైతో వైరల్ వీడియో | Fourth Line News
సంజీవ్ కపూర్ వెయిటర్‌గా నటించిన వీడియోలో బోమన్ ఇరానీ ఫన్నీగా స్పందించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరి కామెడీ టైమింగ్ నెటిజెన్లను ఆకట్టుకుంటోంది.
* ఫుడ్ సర్వ్ చేసిన వెంటనే టీ కావాలా అని అడిగిన
* ఫన్నీగా ముందు తినమంటూ అన్న బోమన్ ఇరానీ
* వీళ్ళిద్దరి సంభాషణ ఇంస్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతుంది
భారతదేశంలో పాకశాస్త్ర నిపుణుల గురించి మాట్లాడితే మొదట గుర్తించేది పేర్లలో చెఫ్ సంజీవ్ కపూర్ మాత్రమే. అలాగే తన వంటకాలతో పాటు సరదాగా ఉంటూ ఎంతోమంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. తాజాగా ఆయన ప్రముఖ నటుడు బోయన్ ఇరానికి వెయిటర్ గా మారి టీ అడిగిన ఓ సరదా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంది
పూర్తి వివరాల్లోనికి వెళితే : ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో బోమన్ ఇరానీ రెస్టారెంట్లో ఆహారం కోసం ఎదురుచూస్తూ కనిపిస్తారు. అంతలో సంజీవ్ కపూర్ ఒక డిష్ తీసుకొచ్చి వావ్ ఎంత బాగుందో ఈ డిష్ సర్వీస్ కూడా చాలా వేగంగా జరిగింది. దీనికి మంచి టిప్ ఇవ్వాల్సిందే ఏమంటారు అని అనడం జరిగింది .
వెయిటర్ గెటప్‌లోకి మారిన సంజీవ్ కపూర్‌ను చూసిన బోమన్ ఇరానీ సరదాగా స్పందించారు. ఆర్డర్ తీసుకుంటున్నట్లు నటించిన సంజీవ్ కపూర్‌కు బోమన్ వెంటనే
“మొదట నన్ను తిననివ్వండి… తర్వాత టిప్ గురించి మాట్లాడితే బాగుంటుంది!” అని జోక్ వేశారు. ఈ మాట వినగానే సంజీవ్ భారీగా నవ్వేశారు.
సంజీవ్ కపూర్ ఈ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ,
“ఏమీ లేదు… పాజిటివ్‌గా ఉండమని, నిన్ను నువ్వు నమ్ముకోమని మా అమ్మ ఎప్పుడూ చెప్పేది… అదే ఫాలో అవుతున్నాను”
అని ఒక సరదా క్యాప్షన్ జోడించారు.
ఈ వీడియో బయటకొచ్చిన వెంటనే నెటిజెన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. సంజీవ్–బోమన్ ఇరానీ మధ్య కనిపించిన కెమిస్ట్రీ, వారి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉందని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
* వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ మీకు ఎలా అనిపించింది
* మీ యొక్క అభిప్రాయాన్ని కచ్చితంగా తెలపండి
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0