కర్ణాటక ‘ట్రీ ఉమెన్’ తిమ్మక్క ఇకలేరు
పద్మశ్రీ అవార్డు గ్రహీత, కర్ణాటక ‘ట్రీ ఉమెన్’ సాలుమరద తిమ్మక్క (114) అనారోగ్యంతో కన్నుమూశారు. జీవితాంతం 8 వేలకుపైగా చెట్లు నాటి పర్యావరణానికి అపూర్వ సేవ చేసిన మహనీయురాలు.
కర్ణాటకకు చెందిన పేరెన్నికగన్న పర్యావరణ సేవకురాలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క ఇక లేరు.
114 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ఆమె కన్నుమూయడం పర్యావరణ ప్రేమికులను విషాదంలో ముంచింది.
1911లో ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన తిమ్మక్క, చెట్లను తన పిల్లలుగా భావించి వాటి కోసం జీవితాంతం శ్రమించారు. రహదారుల వెంట 8 వేలకుపైగా మొక్కలు నాటి, వాటిని పెంచి సంరక్షించిన ఆమె సేవలకు ‘ట్రీ ఉమెన్ ఆఫ్ కర్ణాటక’ అనే బిరుదు దక్కింది. చిన్నతనంలోనే చదువు ఆగిపోయినా, ప్రకృతి సేవలో ఆమె చూపిన అంకితభావం దేశానికి ప్రేరణగా నిలిచింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0