రిషబ్ పంత్ కెప్టెన్సీలో టీం..? కోహ్లీ రీఎంట్రీతో జట్టుకు అదనపు బలం
విజయ్ హజరే ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. విరాట్ కోహ్లీ రీఎంట్రీతో జట్టు మరింత బలంగా మారింది. పూర్తి వివరాలు Fourth Line News లో చదవండి.
* పంత్ నాయకత్వంలో టీం ఎలా ఉండబోతుంది
* ఢిల్లీ జట్టులో కీలక మార్పులు కింగ్ కోహ్లీ మరియు
* డిసెంబర్ 24న బెంగళూరులో ప్రారంభం కానుంది
* కోహ్లీకి హోమ్ గ్రౌండ్ అవడంతో ఛాన్స్
* న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ప్రారంభం అయ్యేవరకు ?
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news కథనం : రిషబ్ పంత్ దేశవాళీ క్రికెట్లో కీలక బాధ్యతలు చేపడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే భారత వికెట్ కీపర్ బ్యాటర్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్ ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్నాడు. డిసెంబర్ 24న బెంగళూరులో ప్రారంభం కానున్న విజయ్ హాజరే ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు సారథ్యం వహించబోతున్నాడు. ఢిల్లీ జట్టు మరింత బలం చేకూర్చేందుకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సీనియర్ ప్లేయర్ఇషాంత్ శర్మ, నవదీప్ సైనీ జట్టులోకి తిరిగి వచ్చారు.
BCCI ఒక కీలకమైన ఆదేశాన్ని జారీ చేయడం జరిగింది. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు అందరూ తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్లో పాల్గొనాలి అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పలు మార్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో సమావేశమైన ఢిల్లీ సీనియర్ సెలెక్టర్ కమిటీ తుది జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఈ సమావేశంలో సెలెక్టర్లు, చీఫ్ కోచ్, డిడిసిఎ, కార్యదర్శి పాల్గొన్నారు.
బెంగుళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో విజయ్ హజరే ట్రోఫీలో భాగంగా ఢిల్లీ తన తొలి రెండు మ్యాచ్లను ఆంధ్ర మరియు గుజరాత్ జట్లతో తలబడునుంది. విరాట్ కోహ్లీ ఆర్సిబి తరఫున ఐపీఎల్ ఆడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. విరాట్ కోహ్లీ కి ఈ గ్రౌండ్ హోం గ్రౌండ్ కావడం ఒక విశేషం గా మారింది. అలాగే దక్షిణాఫ్రికా తో జరిగిన వన్డే సిరీస్లో కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. అదే సిరీస్లో ఆడే అవకాశాన్ని కోల్పోయిన పంత్ ఈసారి ఆడే మ్యాచ్లో తన పామును అందుకునే అవకాశం ఉంది అని విశ్లేషకులు చెప్తున్నారు.
2009 / 10 సీజన్ తర్వాత కోహ్లీ ఈ ఆడటం ఒక విశేషమని చెప్పుకోవచ్చు. మరోపక్క యువ ఆల్రౌండర్ ఆయుష్ బదోని వైస్ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ప్రారంభం అయ్యే వరకు జనవరి 11 ఢిల్లీ జట్టుకు అందుబాటులో ఉంటారు. 2012/ 13 సీజన్స్ లో ఢిల్లీ ఈ ట్రోఫీని గెలుచుకుంది. మరి ఈ సీజన్ కూడా ట్రోఫీని గెలవాలి అని అనేకంచనాలతో బరిలోకి దిగింది. మరి ఢిల్లీ గెలుస్తుందా? పంచే విధంగా నాయకత్వం వహించబోతున్నాడు? మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా మాకు తెలియజేయండి. ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా క్రికెట్లో జరిగే ప్రతి సందర్భమును మీకు మేము అందిస్తాము.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0