రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీకి షాకింగ్ కలెక్షన్లు!
రష్మిక మందన్నా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధారణ స్పందన. తొలి రెండు రోజుల్లో మొత్తం ₹3.8 కోట్లు వసూలు. ఆదివారం కలెక్షన్లు పెరగొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన “ది గర్ల్‌ఫ్రెండ్” సినిమా ప్రేక్షకుల్లో చర్చనీయాంశమవుతోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు.
ట్రేడ్ వెబ్‌సైట్ Sacnilk ప్రకారం, తొలి రోజు తెలుగు, హిందీ వెర్షన్ల కలిపి సినిమా ₹1.30 కోట్లు నెట్ కలెక్షన్లు రాబట్టగా, రెండో రోజు ₹2.50 కోట్లు వసూలు చేసింది.
ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు కొంత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు, గీతా ఆర్ట్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, బుక్ మై షోలో మొదటి రోజు 34,000 టికెట్లు, రెండో రోజు 68,000 టికెట్లు అమ్ముడైనట్లు తెలిపారు.
fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0