రామ్ పోతినేని డేటింగ్ రూమర్లపై స్పందించారు – ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

రామ్ పోతినేని తనపై వస్తున్న డేటింగ్ రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ప్రమోషన్స్‌లో రజనీకాంత్‌పై అభిమానాన్ని, డబుల్ ఇస్మార్ట్ వైఫల్యాన్ని కూడా వివరించారు.

flnfln
Nov 25, 2025 - 17:13
Nov 25, 2025 - 17:22
 0  4
రామ్ పోతినేని డేటింగ్ రూమర్లపై స్పందించారు – ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

* నామీద హీరోయిన్ పైన వస్తున్న ప్రచారం అంతా 

*  ఒక ప్రేమ గీతం రాయడం వల్లనే ఈ పుకార్లు ప్రారంభం 

* హీరోయిన్గా ఆమెను ఇంకా ఫైనల్ చేయలేదు అని హీరో 

fourth line news : రామ్ హీరోగా నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూక ప్రమోషన్ లో తన పైన వస్తున్న డేటింగ్ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో రామ్ పోతినేని. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా ఈనెల నవంబర్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో రామ్ పోతినేని ఎవరికి తెలియని విషయాలు పంచుకున్నారు. 

హీరోగా రామ్ పోతినేని నటిస్తుండగా హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా షూటింగ్ ప్రారంభించిన కానుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ప్రచారంపై రామ్ స్పందిస్తూ ఈ సినిమా కోసం నేను ఓ ప్రేమ గీతం రాసుకున్నాను. అప్పటి నుంచే ఈ పుకార్లు మొదలయ్యాయి. హృదయంలో ఏమీ లేకుండా అంతా గొప్పగా అద్భుతంగా పాట ఎలా రాశారని చాలామంది అనుకుంటున్నారు. కానీ రామ్ చెప్పిన సమాధానం నేను కేవలం సినిమాలోని పాత్రను ఊహించుకొని పూర్తిగా ఆ పాత్రలోనికి వెళ్ళిపోయి ఆ పాటను రాసాను అని ఆయన చెప్పారు. అంతేకాదు ఆ సమయానికి హీరోయిన్ ఇంకా ఫైనల్ చేయలేదు అని ఆయన వివరణ ఇచ్చారు. 

 

ఈ సందర్భంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ పట్ల తనకున్న గాఢమైన అభిమానాన్ని కూడా అతను పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి చెన్నైలో పెరిగిన కారణంగా రజనీ సినిమాలన్నీ చూసే వాడినని చెప్పారు. ముఖ్యంగా ‘బాషా’ చిత్రం విడుదలై 100 రోజులు అయిన తర్వాత కూడా టికెట్లు దొరకని పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుచేసుకున్నారు.

ఆ రోజు థియేటర్‌లో అభిమానులు చేసుకున్న సంబరాలు, ఊరేగింపులు, ఉత్సాహం—all together—తనను పూర్తిగా ఆశ్చర్యపరిచాయని తెలిపారు.

“అలాంటి అనుభవం మరోసారి దొరకదు… నిజంగా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది” అని ఆయన నెమరువేసుకున్నారు.

తన గత చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ గురించి కూడా ఆయన ఓపెన్‌గా మాట్లాడారు. సినిమా కథలో భావోద్వేగాలు బాగా ఉన్నప్పటికీ, అవి ప్రేక్షకులతో అనుకున్నంతగా కనెక్ట్ కాలేదని స్పష్టంగా అంగీకరించారు. అదే చిత్రానికి ఆశించిన విజయాన్ని తీసుకురాలేదన్న నిజాన్ని వినయంగా ఒప్పుకున్నారు.

ఇక ఆయన రాబోయే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాలో రామ్ ఒక స్టార్ హీరోకు ఫ్యాన్‌గా కనిపించనున్నారని తెలిపారు. అభిమానుల జీవితాలను, భావోద్వేగాలను చూపించేలా ఈ పాత్రను డిజైన్ చేసినట్లుగా సమాచారం. ఈ క్యారెక్టర్ రామ్ కెరీర్‌లో మరో ప్రత్యేక హైలైట్‌గా నిలుస్తుందనేది టాక్.

* రామ్ హీరోగా నటించిన ఏ సినిమా అంటే మీకు ఇష్టం 

* మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి 

* అలాగే హీరో మీద ఉన్న మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా మాకు తెలపండి 

* fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.