రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’: సినిమాను తీయడానికి ఆ వ్యక్తి కారణం ?

రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఈ నెల 27న విడుదల కానుంది. 2002 ఫ్యాన్స్ కల్చర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్ర కథ ఎలా పుట్టింది? ఉపేంద్ర మాటతో దర్శకుడికి వచ్చిన ఆలోచన ఏమిటి? Fourth Line News ప్రత్యేక కథనం.

flnfln
Nov 25, 2025 - 12:18
 0  3
రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’:  సినిమాను తీయడానికి ఆ వ్యక్తి కారణం ?

Main points :

* రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా ఈనెల 27న రానుంది. 

* ఉపేంద్ర చెప్పిన మాటను బట్టి ఈ సినిమా స్టోరీ రాసుకున్న దర్శకుడు. 

* సినిమా 22 నాటి ఫ్యాన్స్ కల్చర్ కాలములో సాగే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని. 

* సినిమాకి రామ్ పోతినేని సరైన ఎంపిక అని చిత్రబృందం చెప్పింది 

* 27న విడుదలవుతుంది ఈ సినిమా 

 fourth line news : రామ్ పోతినేని నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.మహేశ్‌ బాబు పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల‌ 27న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే , కన్నడ స్టార్ ఉపేంద్ర కీలకమైన పాత్రను పోషించారు. ఈ సినిమా పైన ఇప్పటికే అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే పాటలు, ట్రైలర్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అభిమానులందరూ ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. 

దర్శకుడు మహేశ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలను పంచుకున్నారు. దాదాపుగా ఈ కథ 2002 కాలంలో నడుస్తుందని. అప్పట్లో ఉన్న ఫ్యాన్స్ కల్చర్ హీరోల పట్ల అభిమానులు చూపించే అపూర్వమైన ప్రేమను ఈ చిత్రంలో చూపించబోతున్నట్టు ఆయన తెలిపారు. అందుకే సినిమా పేరు సరిగ్గా సరిపోయింది అని పేరుకు అర్థం తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు ఆగాలి అని అభిమానుల్లో ఒక ఊహాగానాన్ని విడిచి పెట్టడం జరిగింది. 

ఈ సినిమా ఎలా పుట్టింది? ఏ ఆలోచన నుంచి ఈ కథకు మొదలు పడింది? అనే ప్రశ్నకు స్పందిస్తూ దర్శకుడు మహేశ్ బాబు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

‘‘రానా ద‌గ్గుబాటి హోస్ట్ చేసిన ఓ ఇంటర్వ్యూలో ఉపేంద్ర గారు మాట్లాడుతూ – ‘నిజమైన నన్ను సినిమాల్లోనే చూస్తారు’ అని చెప్పిన మాట నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ ఒక్క లైన్‌ నా మనసులో బలంగా మిగిలిపోయింది. అభిమానులు తమ హీరోను ఎలా చూస్తారు? ఆ ప్రేమలో ఎంత నిష్ఠ, ఎంత భావోద్వేగం ఉంటుందనే కోణంలో ‘సూర్య’ అనే పాత్రను ఆలోచించాను. ఆ వ్యక్తిత్వానికి, ఆ ఇమేజ్‌కి ఉపేంద్ర గారే సరైన ఎంపిక అని వెంటనే అనిపించింది’’ అని చెప్పారు.

దీంతో కథ పుట్టి, రూపుదిద్దుకుంది. తరువాత హీరో విషయంలో ఎలాంటి సందేహం రాలేదని మహేశ్ బాబు వెల్లడించారు. ‘‘ఈ కథను రామ్‌కి చెప్పగానే ఆయన ఎలాంటి ఆలస్యం లేకుండా ఒప్పుకున్నారు. అభిమాన పాత్రలోకి కావలసిన ఎనర్జీ, మాస్ అటిట్యూడ్, ఎమోషన్… ఇవన్నీ రామ్‌లో సహజంగానే ఉన్నాయి. అందుకే ఈ పాత్రను ఆయన తప్ప మరెవరూ చేయలేరని నమ్మాను’’ అని అన్నారు.

హీరోయిన్ పాత్ర కూడా కథలో కీలక మలుపు తీసుకువస్తుందని, ఆ పాత్ర చుట్టూ వచ్చే ఎమోషన్స్ సినిమాకు బలమైన పాయింట్ అవుతాయని చెప్పారు. వివేక్-మెర్విన్ అందించిన సంగీతం చిత్రానికి మరో స్థాయి జీవం పోసిందని ఆయన ప్రకటించారు.

‘‘దక్షిణాదిలో అభిమానులు హీరోలను కేవలం నటులుగా కాకుండా తమ జీవితంలో భాగంగా భావిస్తారు. ఆ ప్రేమ ఎంత పవిత్రంగా ఉంటుందో, ఆ బంధం ఎంత గొప్పదో – అదే భావాన్ని ఈ సినిమాలో చూపించాలనుకున్నాము’’ అని దర్శకుడు ధీమాగా వెల్లడించారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో ! అభిమానులను ఎలా అలరించిందో అని. 

* మరి ఈ సినిమా పై మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి 

* రామ్ పోతినేని సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమాను కామెంట్ చేయండి. 

* సినిమా పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా తెలపండి. 

* fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.