రాజమౌళి – మహేష్ బాబు “వారణాసి” టైటిల్‌పై కొత్త చిక్కు! మారుస్తారా?
మహేష్ బాబు–రాజమౌళి భారీ చిత్రమైన “వారణాసి” టైటిల్‌పై కొత్త వివాదం తలెత్తింది. తెలుగులో టైటిల్ మార్చే అవకాశం ఉందన్న వార్తలు. పూర్తి వివరాలు Fourth Line News లో చదవండి.
* మహేష్ రాజమౌళి సినిమాకు ఒక చిక్కు వచ్చి పడింది
* వారణాసి టైటిల్ పై సమస్య తలెత్తింది
* గతంలో కూడా అనేక సినిమాలకు ఈ సమస్య
* మరి ఇప్పుడు రాజమౌళి ఏం చేస్తాడు అనేది చూడాలి.
* పూర్తి వివరాల్లోనికి వెళితే.
fourth line news :
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తరికక్కుతున్న సినిమా" వారణాసి " . అయితే ఇప్పుడు అదే పేరుతో చిక్కొచ్చి పడింది. ఈ చిత్రానికి ఇటీవలే మేకర్స్ వారణాసి అనే పేరు ఖరారు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ టైటిల్ విషయంలో ఓ చిన్న చిక్కు వచ్చింది. తెలుగులో వారణాసి అనే పేరు మారుస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
వారణాసి అనే పేరు వేరే నిర్మాత సంస్థ రిజిస్టర్ చేసుకుంది. రామభక్త హనుమ క్రియేషన్స్ బ్యానర్ పై సిహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలో ఇదే పేరుతో చిన్న చిత్రం గతంలోనే ప్రకటించారు. దీంతో రాజమౌళి సినిమాకు తెలుగులో ఇదే టైటిల్ రావడం పై సాంకేతిక ఇబ్బందులు తలెత్తడం జరిగింది. చిత్ర బృందం ఒక కొత్త ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగులో ఆ సినిమాకు రాజమౌళి వారణాసి అనే టైటిల్ తో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు అంట. భారత్ అంతర్జాతీయ భాషలో మాత్రం యధావిధిగా వారణాసి పేరుతోనే రిలీజ్ చేయాలి అని ఫిలింనగర్ వర్గాల్లో టాక్ అయితే వస్తుంది.
నిజానికి ఈ టైటిల్ వివాదము అనేది ఎప్పటినుంచో కొనసాగుతూ ఉంది. గతంలో మహేశ్ బాబు కాలేజస్ సినిమా టైటిల్ పై వివాదం రావడంతో ఆ సినిమాకి మహేశ్ ఖలేజా గా మార్చేశారు. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమాకి కూడా " కుబేర " అనే టైటిల్ పై సమస్య రావడంతో ఆ చిత్రం పేరు శేఖర్ కమ్ముల" కుబేర " గా సినిమాను విడుదల చేశారు. ఇప్పుడు రాజమౌళి చేస్తున్న సినిమా కూడా అదే సమస్య వచ్చింది మరి టైటిల్ మార్చే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి.
నిజానికి ఈ వార్త పైన ఇప్పటివరకు చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలి అంటే కొంతకాలం ఆకల్సి ఉంది. ఈ ఈ సినిమాలో మహేశ్ రుద్ర పాత్రలో నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా 2027 సంవత్సరంలో విడుదల చేసేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. మరి రాజమౌళి టైటిల్ మారుస్తారా లేదా అనేది వేచి ఉండాలి.
* రాజమౌళి చిత్రం టైటిల్ మారుస్తారా మార్చరా ?
* రాజమౌళి తీసిన సినిమాలో మీకే సినిమా అంటే ఇష్టం ?
* ఈ రెండు ప్రశ్నలకి మీయొక్క సమాధానాన్ని తెలపండి.
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0