రైతులు ఆందోళన చెందవద్దు – యూరియా సమస్య త్వరలోనే పరిష్కారం : మంత్రి పొన్నం ప్రభాకర్
Telangana Minister Ponnam Prabhakar assured farmers that the urea supply issue will be resolved soon, stating that distribution is under the control of the central government. He also launched development works in Husnabad constituency and highlighted various welfare schemes including free electricity, Indiramma housing, and ration benefits.
• రైతులు ఆందోళన చేయొద్దు
• కేంద్రం చేతిలోనే ఉంది యూరియా అందించడం
• రైతన్నలు ఆందోళన చెందొద్దు
• త్వరలోనే యూరియా సమస్య తీరుతుంది
యూరియా సరఫరా కేంద్రం చేతిలోనే ఉంది. కేంద్ర మంత్రులకు పలుమార్లు తగిన యూరియా సరఫరా చేయాలి అని విజ్ఞప్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించడం జరిగింది. రైతులు ఆందోళన చేయవద్దు యూరియా సమస్య త్వరలోనే తీరుతుంది అని భరోసా ఇచ్చారు.హుస్నాబాద్ నియోజకవర్గం వెంకేపల్లి, సైదాపూర్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను పనులు ప్రారంభించారు.
మీ గ్రామంలో ఏ సమస్య ఉన్న పరిష్కరిస్తున్నాం. గ్రామాల్లో రోడ్లు నాళాలు అంగన్వాడి భవనాలు గ్రామపంచాయతీ భవనాలు ఇలా అభివృద్ధి పనులు ప్రారంభించుకుంటున్నాము నీ తెలిపారు
హుస్నాబాద్ మొత్తంగా మా నాన్న పేరు మీద స్టీల్ బ్యాంక్ పంపిణీ చేస్తున్నామని ప్రతి హోటల్లో స్టీల్ సామాగ్రి ఉండేలా చేస్తున్నామన్నారు. ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంది అని ప్రతి ఒక్కళ్ళు స్టీల్ వస్తువులు వాడాలి అని సూచించారు. ఇంకా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. 200 యూనిట్ ఉచిత విద్యుత్, మరియు 500 కి గ్యాస్ ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం రేషన్ కార్డులు, ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాము
.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0