పెళ్లి అయి 24 గంటలే… కోర్టు మెట్లు ఎక్కిన కొత్త జంట! ఈ వార్త చదవండి మీరే ఆశ్చర్యపోతారు ?
పుణేలో ఒక జంట పెళ్లైన 24 గంటల్లోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. భర్త తన మర్చంట్ నేవీ ఉద్యోగం గురించి నిజం దాచడమే ఇందుకు కారణం. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
1. పెళ్లికి ముందు నిజం దాచిన భర్త.
2. పెళ్లి తర్వాత నిజం తెలిసే నా భార్య షాక్
3. ఆరు నెలలు ఓడలోనే తన పని అంట !
4. భార్య భర్తలు అంటే కలిసి ఉండాలి కదా
5. పెళ్లయిన 24 గంటలకే విడాకులు
6. ఈ విడాకులపై అనేకమంది ఆలోచనలు.
7. పూర్తి వివరాల్లోనికి వెళితే ఈ సమాచారం మొత్తం మీకు అర్థమవుతుంది :
ఫోర్త్ లైన్ న్యూస్ కథనం ; ఇటీవల పుణేలో జరిగిన ఒక సంఘటన నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. పెళ్లైన 24 గంటల్లోనే ఒక దంపతులు విడాకులకు దరఖాస్తు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
వివరాల్లోకి వెళ్తే, ఈ జంట కొంతకాలంగా ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. పెళ్లి అన్నీ సంప్రదాయాల ప్రకారం ఘనంగా జరిగింది. అయితే పెళ్లి అయిన తర్వాత అసలు విషయం బయటపడింది. భర్త తన పని గురించి పూర్తి నిజాన్ని పెళ్లికి ముందుగా చెప్పలేదని భార్య ఆరోపించింది. అతను తాను మర్చంట్ నేవీలో డాక్టర్‌గా పనిచేస్తున్నానని, డ్యూటీకి వెళ్తే కనీసం ఆరు నెలలు ఓడలోనే ఉండాల్సి వస్తుందని పెళ్లి అయిన తర్వాత వివరించాడు.
ఈ విషయం విన్న భార్య తీవ్రంగా నిరాశ చెందింది. “ఇంత ముఖ్యమైన విషయం పెళ్లికి ముందే చెప్పాల్సింది కదా?” అంటూ ఆమె భర్తను ప్రశ్నించింది. కుటుంబ జీవితం అంటే ఇద్దరూ కలిసి ఉండటం, ఒకరికొకరు సమయం కేటాయించడం, పరస్పర సహకారం అవసరమని ఆమె అభిప్రాయం. ఆరు నెలలు భర్త దూరంగా ఉండే ఉద్యోగం తనకు మానసికంగా, భావోద్వేగంగా ఇబ్బందికరమని ఆమె చెప్పింది.
ఇక్కడ భర్త వాదన వేరేలా ఉంది. “నా ఉద్యోగం గురించి దాచాలనే ఉద్దేశం లేదు. పెళ్లి తర్వాత చెప్పినా అర్థం చేసుకుంటుందనుకున్నాను” అని అతను తెలిపినట్లు సమాచారం. అయితే, భార్య మాత్రం ఇది చిన్న విషయం కాదని, తన జీవితాన్ని ప్రభావితం చేసే కీలక అంశమని స్పష్టంగా చెప్పింది. ఈ విషయంపై ఇరువురి మధ్య వాగ్వాదాలు పెరిగి, చివరకు పెళ్లైన 24 గంటల్లోనే విడాకులకు దరఖాస్తు చేసే స్థాయికి చేరాయి.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలామంది భార్య వైపే నిలబడి, “ఉద్యోగం, జీవనశైలి, భవిష్యత్ ప్రణాళికలు వంటి విషయాలు పెళ్లికి ముందే స్పష్టంగా మాట్లాడుకోవాలి” అని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు మాత్రం “ఇంత చిన్న వ్యవధిలో విడాకులు అనేది తొందరపాటు నిర్ణయం” అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది యువతీ యువకులు ఈ సంఘటనను ఒక గుణపాఠంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
నిజానికి పెళ్లి అనేది కేవలము ఇద్దరి మధ్య బంధుత్వం కాదు రెండు కుటుంబాలు కలిసి సంతోషంగా జీవించడం. పెళ్లికి ముందే అన్ని నిజాలు చెప్పుకుంటే బాగుంటుంది. పెళ్లయిపోయినంక అన్ని విషయాలు బయటకు వస్తే ఇలానే ఉంటుంది అని ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు.
ఈ ఘటన ద్వారా యువత యువతులందరికీ ఒక సందేశం స్పష్టంగా అర్థమవుతుంది. ఏ విషయమైనా దాచుకున్న నిజాయితీగా చెప్పడం ఎదుటివారి భావాలను గౌరవించడం చాలా ప్రాముఖ్యము అని తెలుస్తుంది. నిజం తర్వాత చెప్తే అర్థం చేసుకుంటారు అనే ఆలోచన అన్ని సందర్భాలలో పనిచేయదు. ముఖ్యంగా పెళ్లి విషయంలో అన్ని విషయాలు ముందుగానే చర్చించాలి అదే చాలా మంచిది.
చివరికి ఈ సంఘటన ఏం జరిగింది అంటే ప్రేమ ఎంత బలమైన కూడా పెళ్లికి ముందు పరస్పర అవగాహన లేకపోతే బంధం నిలబడదు అని ఈ విషయం వల్ల తెలుస్తుంది. యువతి యువకులకు ఇరు కుటుంబాలు అన్ని ముందుగానే స్పష్టముగా అన్ని మాట్లాడుకోవాలి అదే మంచిది అని ప్రజలు వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంపై మీయొక్క అభిప్రాయాన్ని కచ్చితంగా తెలియజేయండి ? ఫోర్త్ లైన్ న్యూస్ కథనం
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0