ప్రభాస్ ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్ అదిరింది
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తోన్న ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. బియర్డ్ లేకుండా పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్ కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తోన్న కొత్త సినిమా టైటిల్ ఫైనల్ అయ్యింది. ఈ భారీ యాక్షన్ డ్రామాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
దీనితో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ బియర్డ్ లేకుండా పవర్‌ఫుల్ ఆర్మీ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. “ఒంటరిగా పోరాడే ఒక బెటాలియన్” అనే ట్యాగ్‌లైన్‌తో పోస్టర్‌కు మరింత ఇంపాక్ట్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికే ఈ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ #Fauji #Prabhas హ్యాష్‌ట్యాగ్స్‌తో ఫైర్ చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0