అన్నదాతలకు అదనపు ఆదాయం.. 'పీఎం కుసుమ్' పథకంతో మీ బంజరు భూమే బంగారు గని!
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం-కుసుమ్ (PM-KUSUM) పథకం ద్వారా రైతులు తమ బంజరు భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఏడాదికి ₹20 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈ పథకం అర్హతలు, పెట్టుబడి మరియు లాభాల గురించి fourth line news కథనం ఇక్కడ చూడండి.
* రైతులందరికీ ఒక శుభవార్త చెప్పిన కేంద్రం
* దేనికి పనికిరాని భూములను సోలార్ పాయింట్లు ఏర్పాటు
* సంవత్సరానికి ₹20 లక్షలు సంపాదించే అవకాశం ఉంది
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news కథనం : దేశంలో ఉన్న రైతులకు ఒక శుభవార్త తెలియజేసిన కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 20 లక్షలు సంపాదించే వరాన్ని ఇస్తున్నట్టుగా ప్రకటించారు. పూర్తి వివరాల్లోనికి వెళ్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపుగా పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అన్నదాతలకు అదునపు ఆదాయం కోసం " PM - KUSUM అనే పథకాన్ని తీసుకువచ్చింది. సాగుకు పనికిరాని భూములను విద్యుత్ కేంద్రాలుగా మార్చే ఆ భూమి అన్నదాతలకు అదనపు ఆదాయాన్ని కలిగించడమే ఈ పథకానికి ముఖ్య ఉద్దేశం. రైతన్నల పొలంలో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని అవకాశాన్ని కల్పించారు.
నల్లగొండ జిల్లాలో సుమారుగా 750 దరఖాస్తులు. విద్యుత్ ఉప కేంద్రాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూములకే ఈ అవకాశాన్ని కలిగి ఉంటుంది. ప్రారంభంలో పెట్టుబడి కొంత ఎక్కువగా ఉన్నప్పటికీని కూడా ఇదే 25 సంవత్సరాలు పాటు శిరమైన ఆదాయాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన పథకము అని అధికారులు చెబుతున్నారు.
పీఎం కుసుమ పథకం ఒక రైతు కనిష్టంగా 0.5 మెగావాట్లు ( 500 కిలోవాట్లు ) నుంచి గనిష్టంగా 2 మెగావాట్లు సామర్థ్యం గల పాయింట్లు ఏర్పాటు చేసుకోవచ్చును. అలాగే అర మెగా వాట్ (0.5 మీ ) ప్లాంట్లో ఏర్పాటుకు సుమారుగా 1.50 కోట్లు పెట్టుబడి అవసర పడుతుంది. ఇందుకోసం బ్యాంకులో 70% వరకు రుణాము సదుపాయము పొందుకోవచ్చు. ప్రభుత్వం నిర్ణయించిన టార్చ్ యూనిట్కు సుమారుగా 3.13 ప్రకారం సంవత్సరానికి 22 లక్షల నుంచి 25 లక్షలు పొందుకునే అవకాశం ఉంది. బ్యాంకు లోన్ వాయిదాలు నిర్వహణ ఖర్చులు పోను రైతుకు కనీసం ఏడాదికి 15 నుండి 20 లక్షల వరకు ఆదాయం మిగిలే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతున్నారు.
చాలా భూములు పనికిరాని భూములుగా వృధాగా వదిలేస్తున్నారు రైతులు అటువంటి భూములలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ ఉత్పత్తి అవ్వడమే కాకుండా రైతుకు నెలకి లక్షల్లో ఆదాయము సంపాదించుకోవచ్చు. ఉత్పత్తి చేసిన విద్యుత్తును నేరుగా డిస్కలే కొనుగోలు చేస్తాయి కాబట్టి మార్కెటింగ్ సమస్య ఏమాత్రం ఉండదు. రైతు వ్యక్తిగతంగా లేదా రైతు సంఘాల కలిసే పాయింట్లు ఏర్పాటు చేసుకోవచ్చని తెలంగాణ పునరుద్దారనియు ఇంధన వనరులు అభివృద్ధి సంఘం జిల్లా మేయర్ సంతోష్ వెల్లడించడం జరిగింది.
ఈ పథకం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని అధికారులు వెల్లడించారు విద్యుత్ ఉపకేంద్రాల సమీపంలో ఉన్న భూములను రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు వెల్లడిస్తున్నారు. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0