‘పెద్ది’ సినిమాలో సీనియర్ నటి శోభన కీలక పాత్రలో......
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో సీనియర్ నటి శోభన కీలకపాత్రలో నటించనున్నారు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ నుంచి మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రంలో సీనియర్ నటి శోభన కీలకపాత్రలో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా ఆమెను సంప్రదించి పాత్ర వివరాలు వివరించినట్లు సమాచారం.
ఈ సినిమా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఎంపిక కాగా, జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ లాంటి నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే శోభన ఎంట్రీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
‘పెద్ది’ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. రామ్ చరణ్ క్యారెక్టర్, బుచ్చిబాబు తెరకెక్కింపు, తారాగణం అన్నీ కలిపి ఈ మూవీని హాట్ టాపిక్‌గా మార్చేశాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0