నిజామాబాద్‌లో బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం – కంప్యూటర్లు, పత్రాలు భస్మం

నిజామాబాద్‌లోని తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం. 25 కంప్యూటర్లు, 7 ఏసీలు, ముఖ్య పత్రాలు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు, దర్యాప్తు కొనసాగుతుంది.

flnfln
Nov 27, 2025 - 10:18
Nov 27, 2025 - 10:25
 0  3
నిజామాబాద్‌లో బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం – కంప్యూటర్లు, పత్రాలు భస్మం

* బ్యాంకు భారీ అగ్ని ప్రమాదం 

* ఈ అగ్ని ప్రమాదంలో 25 కంప్యూటర్లు 7 ఏసీలు 

* బ్యాంకులో ఉన్న విలువైన పత్రాలు బూడిద  

* బ్యాంకు మేనేజరు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు 

* పూర్తి వివరాలు కింద ఉన్నాయి చదవండి 

fourth line news : ఘటనా స్థలం: నిజామాబాద్ జిల్లా తెలంగాణ, 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో అగ్నిప్రమాదం వాటిల్లుకుంది. ఈ అగ్ని ప్రమాదం బుధవారం రాత్రి జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. దాదాపుగా 25 కంప్యూటర్ కాలిపోయాయి. మరియు ఏడు ఏసీల తో పాటు చాలా ముఖ్యమైన పత్రాలు ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయాయి

ఈ అగ్నిప్రమాదం బుధవారం రాత్రి సమయంలో బ్యాంకులో నుంచి దత్తమైన పొగ మంటలు రావడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకి అగ్నిమాప కేంద్రానికి సమాచారాన్ని అందించారు. ఈ సమాచారాన్ని అందుకున్న సిఐ శ్రీనివాస్ , హరిబాబు తన సిబ్బందితో ఘటన సగానికి చేరుకున్నారు. అలాగే అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం ప్రారంభించారు.

బ్యాంకు లోపల మంటలు చాలా ఎక్కువగా రావడంతో లోపలికి అగ్నిమాపక సిబ్బంది వెళ్లడం కష్టతరముగా మారింది. దాదాపుగా రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోనికి తీసుకొని వచ్చారు. అలాగే బ్యాంక్ అధికారులకు ఈ సమాచారాన్ని అందజేసిన వెంటనే వారు కూడా అక్కడికి వచ్చారు. మంటలు పూర్తిగా అర్పిన తర్వాత లోపలికి వెళ్లి పరిశీలిస్తే ఫర్నిచర్ ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు చాలా కీలకమైన డాక్యుమెంట్ పూర్తిగా మంటల్లో కాలిపోయినట్టు గుర్తించారు. 

 ఈ ఘటన పైన బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టు అధికారి హరిబాబు తెలిపారు. అలాగే ఈ యొక్క ప్రమాదానికి గల కారణాలు పరిశీలిస్తున్నాను ఈ ప్రమాదం దాదాపుగా షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేక మరి మరేదైనా కారణమా అని వివిధ రకాల లో విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

* ఈ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకి మీరు కాల్ చేయండి. 

* ఈ వార్త పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.