మరోసారి బిహార్ సీఎం పగ్గాలు నితీశ్‌కే!
బిహార్ రాజకీయాల్లో మరో మార్పు. నితీశ్ కుమార్ తిరిగి సీఎం పదవి చేపట్టనున్నారు. నవంబర్ 19 లేదా 20న ప్రమాణస్వీకారం జరిగే అవకాశముండగా, మంత్రివర్గంలో బీజేపీ, జేడీయూ, లాజెపా పార్టీలకు స్థానాలు కేటాయించబడనున్నాయి.
బిహార్‌లో మరోసారి రాజకీయ హడావుడి మొదలైంది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు సమాచారం. నవంబర్ 19 లేదా 20 తేదీల్లో ప్రమాణస్వీకారం జరగొచ్చని, అయితే ఆ తేదీపై తుది నిర్ణయం ప్రధాని మోదీ షెడ్యూల్‌ను బట్టి తీసుకోనున్నారు.
ఈ ఎన్నికల్లో 89 స్థానాలు సాధించిన బీజేపీకి 15–16 మంత్రిత్వ శాఖలు, 85 సీట్లు గెలుచుకున్న జేడీయూకు దాదాపు 14 పోర్ట్‌ఫోలియోలు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. లోక్ జనశక్తి పార్టీకి మూడు స్థానాలు దక్కవచ్చని చెబుతున్నారు. ఇప్పటివరకు తొమ్మిదిసార్లు CMగా ప్రమాణం చేసిన నితీశ్, మొత్తం 20 సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగిన అనుభవం కలిగి ఉన్నారు.
fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0